బాహుబలి బల్లాలదేవగా మారిపోయారా …?

తెలుగు దృశ్యమాధ్యమ మీడియా లో టివి 9 రవి ప్రకాష్ ఒక బాహుబలి అనే చెప్పొచ్చు. ఒక వ్యక్తి వ్యవస్థగా, శక్తిగా మారి తెలుగు మీడియా కు [more]

Update: 2019-05-17 03:30 GMT

తెలుగు దృశ్యమాధ్యమ మీడియా లో టివి 9 రవి ప్రకాష్ ఒక బాహుబలి అనే చెప్పొచ్చు. ఒక వ్యక్తి వ్యవస్థగా, శక్తిగా మారి తెలుగు మీడియా కు మార్గదర్శి అయిన రవి ప్రకాష్ తన పట్టు కోల్పోకూడదని కొత్త యాజమాన్య బదిలీని అడ్డుకునేందుకు తొక్కని అడ్డదారి లేదని పోలీసులు విచారణ చేసేకొద్ది బయటపడుతుంది. దీంతో రవి ప్రకాష్ ఆయన బృందం పై కేసులపై కేసులు నమోదు కావడం సంచలనం, చర్చనీయాంశం అవుతున్నాయి. టివి 9 పై తనకు వాస్తవంగా లేని పెత్తనం కోసం రవి ప్రకాష్ చేసిన కుట్రలు ఆయనను బాహుబలి క్యారెక్టర్ నుంచి బల్లాల దేవగా మార్చేశాయి.

రవి ప్రకాష్ పై మరో కేసు ….

టివి 9 లోగో , కాపీ రైట్స్ వంటి వి కేవలం 99 వేల రూపాయలకు తన బినామీ మోజో టివి ఎండి హరికిరణ్ కి విక్రయించినట్లు ఆలంద మీడియా తాజాగా బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఇచ్చిన ఈ ఫిర్యాదుపై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే నేషనల్ లా ట్రిబ్యునల్ లో చుక్కెదురైన రవి ప్రకాష్ బృందం కు అడుగడుగునా చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గరుడ పురాణం శివాజీ, రవి ప్రకాష్, మూర్తి, హరికిరణ్, శక్తి అనే వారి మధ్య నడిచిన ఈ మెయిల్స్ బాగోతం మొత్తం బట్టబయలు అయ్యింది. దాంతో ఎన్సీఎల్టీ న్యాయ వివాదం సృష్ట్టించి తాము కొనసాగాలని భావించిన రవి ప్రకాష్ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. జులై 12 కు ఎబిసిఎల్ యాజమాన్య బదిలీ వ్యవహారం కేసును వాయిదా వేసింది. జాతీయ ఎన్సీ ఎల్టియే జులై 9 వరకు ఇచ్చిన స్టే తో అలంద మీడియా పైచేయి సాధించడంతో పాటు టివి 9 టేకోవర్ లో ఇబ్బందులు లేకుండా చేసుకోగలిగింది.

బ్రేకింగ్ న్యూస్ జాబితాలో రవి ప్రకాష్, గరుడ పురాణం …

ఏ చిన్న సంఘటన జరిగినా బ్రేకింగ్ న్యూస్ గా సంచలనంగా మలచడంలో టివి 9 కు పెట్టింది పేరు. ఆ ఛానెల్ ఆ రకంగా ప్రజల్లోకి దూసుకుపోయింది కూడా. సంచలనం కోసం పనికిమాలిన వార్తలను సైతం ఇలా చేస్తున్నారని విమర్శలు వచ్చినా రవి ప్రకాష్ తన పంథా ఎన్నడూ వీడలేదు. ఆ ఫార్ములానే అన్ని ఛానెల్స్ ఇప్పుడు అనుసరిస్తున్నాయి. అదే ఇప్పుడు రవి ప్రకాష్ కొంప ముంచింది. ఫోర్జరీ ఇతర అనేక ఆరోపణలు కేసుల్లో ఇరుక్కున్న టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ కు సంబంధించిన ఏ చిన్న వార్తను తెలుగు మీడియా విడిచిపెట్టడం లేదు. బ్రేకింగ్ న్యూస్ అంటూ రోజంతా నడిపిస్తున్నాయి. సంచలన జర్నలిస్ట్ గా ఎదిగిన రవి ప్రకాష్ చివిరికి తానే తన చెడ్డ చర్యలతో దేశవ్యాప్తంగా సంచలనం అవుతారని ఏ ఒక్కరు ఊహించలేదు. బహుశా రవి ప్రకాష్ కూడా ఇలా తన పరిస్థితి దారుణంగా మారుతుందని భావించి ఉండరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News