జస్ట్ టెన్ డేస్ అంటున్న రవి ప్రకాష్….!!

ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్, ఆయన స్నేహితుడు శివాజీ పోలీసుల ముందు హాజరు కావడానికి పదిరోజులు సమయం [more]

Update: 2019-05-16 01:30 GMT

ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్, ఆయన స్నేహితుడు శివాజీ పోలీసుల ముందు హాజరు కావడానికి పదిరోజులు సమయం అడిగారు. అదీ ఈ మెయిల్స్ ద్వారా కోరడం గమనార్హం. పదిరోజులు సమయం ఇస్తే తాము ఖాకీల ముందు హాజరౌతామన్న వారి అభ్యర్ధనను పోలీసులు నిరాకరించారు. రవి ప్రకాష్ గడువు కోరితే ఇక నటుడు శివాజీ కి ఈ కేసు పెట్టిన తరువాత అనారోగ్యం పాలయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆయన ఎప్పుడు హాజరు అయ్యేది స్పష్టం చేయలేదు. తమ ముందు ఈ కేసుల విచారణలో సహకరించాలని పోలీసులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇవ్వడంతో ఇక వీరు హాజరు కానీ పక్షంలో అరెస్ట్ తప్పదంటున్నారు న్యాయనిపుణులు. అయితే చట్టంలో వున్న ఎదో లొసుగుతో అరెస్ట్ నుంచి తప్పించుకునే అన్ని మార్గాలను ఇద్దరు మిత్రులు వెతుకుతున్నట్లు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

అందుకేనా పదిరోజులు ….

టివి 9 యాజమాన్య బదిలీ వ్యవహారంలో క్రిమినల్, సివిల్ కేసులు మెడకు చుట్టుకోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రవి ప్రకాష్ పదిరోజుల పాటు పోలీస్ విచారణ వాయిదా వేయాలని కోరడానికి పలు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నందున ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఎదో తేలిపోతుందని ఆ తరువాత ప్రభుత్వంలో ఉన్న వారితో రాజీ ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనతోనే ఈ సమయం కోరుతున్నట్లు తేలుతుంది. మరో పక్క తాజా యాజమాన్యంతో రాజీ ప్రయత్నాలు చేసుకోవడానికి ఆ మాత్రం సమయం అవసరమని నిందితులు భావిస్తున్నారని ప్రచారం నడుస్తుంది.

హై కోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ కొట్టివేత …

రవి ప్రకాష్ కి హై కోర్టు లో తాజాగా మరో షాక్ తగిలింది. తమపై నమోదైన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ వాటిని కొట్టివేయాలంటూ రవి ప్రకాష్ హై కోర్ట్ ను ఆశ్రయించారు. తక్షణమే తమ కేసులు విచారించాలని తెలంగాణ హై కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ ను రవి ప్రకాష్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్ట్ అంత అత్యవసరంగా ఈ కేసు పై విచారణ చేయాలిసిన అవసరం లేదంటూ కొట్టేసింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రవిప్రకాష్ ఫోర్జరీ కేసు మరిన్ని మలుపులు తిరిగేలాగే కనిపిస్తుంది.

Tags:    

Similar News