ఈసారి విజిల్ వేస్తుందా? లేదా?

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో రంగంలోకి దిగాయి. అన్నాడీఎంకే, డీఎంకే, మక్కల్ నీది మయ్యమ్ వంటి పార్టీలు [more]

Update: 2020-12-27 18:29 GMT

తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో రంగంలోకి దిగాయి. అన్నాడీఎంకే, డీఎంకే, మక్కల్ నీది మయ్యమ్ వంటి పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. కానీ దినకరన్ పార్టీ ఇప్పటి వరకూ ప్రచారంలోకి దిగలేదు. ఆ పార్టీ ఏ కూటమిలో చేరాలన్నదీ ఇంకా నిర్ణయించుకోలేదు. కూటమిలో చేరాలా? విడిగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

వచ్చే నెలలో విడుదలయిన తర్వాత…..

శశకళ వచ్చే నెలలో జైలు నుంచి విడుదలవుతుండంటంతో మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పరిస్థితిపై స్పష్టత రానుంది. శశికళ విడుదలయిన తర్వాత ముఖ్యనేతలతో ఆమె చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రధానంగా శశికళ కమల్ హాసన్, విజయకాంత్ లతో కలసి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ పార్టీ వైపు వెళ్లని వారిని తమ కూటమిలోకి చేర్చుకోవాలన్న యోచనలో దినకరన్ పార్టీ నేతలు ఉన్నారు.

ఒకే గుర్తును కేటాయించడంతో…..

అయితే ఎన్నికలకు ముందే దినకరన్ పార్టీకి తీపి కబురు అందింది. ఎన్నికల కమిషన్ దినకరన్ పార్టీకి కుక్కర్ గుర్తును కేటాయించింది. గతంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక నుంచి దినకరన్ కుక్కర్ గుర్తుపైనే ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలకు తమకు కుక్కర్ గుర్తు కేటాయించాలని దినకరన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఫలితం లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా ఉప ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో దినకరన్ పార్టీకి కుక్కర్ గుర్తు దక్కలేదు.

సెంటిమెంట్ అంటూ…..

కానీ ఇటీవల ఎన్నికల సంఘం దినకరన్ పార్టీకి కుక్కర్ గుర్తును కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తమకు సెంటిమెంట్ గా కలసి వచ్చిన కుక్కర్ గుర్తుతో ఈసారి తమిళనాడు ఎన్నికల్లో విజయం ఖాయమన్న ధీమాను దినకరన్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుర్తు రావడం శుభసూచకమని చెబుతున్నారు. ఇక శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఆ పార్టీ ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళుతుందన్నది తేలుతుంది.

Tags:    

Similar News