దినకరన్ కు భయం పట్టుకుందా?

టీటీవీ దినకరన్ తన గెలుపు మీదనే భయపడుతున్నట్లుంది. ఆయన గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా [more]

Update: 2021-03-24 18:29 GMT

టీటీవీ దినకరన్ తన గెలుపు మీదనే భయపడుతున్నట్లుంది. ఆయన గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అన్నాడీఎంకే, డీఎంకేలను చిత్తుగా ఓడించారు. బీజేపీకి అయితే డిపాజిట్లు కూడా దక్కలేదు. అలా ఆర్కే నగర్ నుంచి గెలిచిన టీటీవీ దినకరన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొత్త పార్టీని స్థాపించారు.

అందరినీ ఆశ్చర్యంలో పడేసేలా?

ఆర్కేనగర్ గతంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీ చేసింది. అమ్మ నియోజవర్గంగా దానికి పేరు. చెన్నై నగరంలో ఉండే ఆర్కే నగర్ నియోజకవర్గంలో అప్పట్లో దినకరన్ గెలుపునకు అనేక కారణాలున్నాయంటున్నారు. పళని పాలన పట్ల ప్రజలకు తెలియకపోవడం, శశికళ జైలుకు వెళ్లిందన్న సానుభూతి ఎక్కువగా ఉండటంతోనే ప్రజలు దినకరన్ వైపు మొగ్గు చూపారు. అయితే గెలిచిన నాటి నుంచి దినకరన్ ఆర్కే నగర్ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

సమస్యల పరిష్కారానికి….

ఆర్కే నగర్ లోని సమస్యల పరిష్కారానికి కూడా దినకరన్ ప్రయత్నించలేదు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో పళనిస్వామి నిధులను కూడా ఆర్కే నగర్ కు కట్ చేశారంటారు. దీంతో పాటు సొంత పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ను బలోపేతం చేయడంపైనే దినకరన్ ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ఈసారి ఆయన ఆర్కేనగర్ లో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు కష్టమని భావించారు.

అందుకే ఈసారి….

కరోనా సమయంలోనూ దినకరన్ ఆర్కే నగర్ ప్రజలకు అండగా ఉండింది లేదు. దీంతో దినకరన్ ఈసారి ఆర్కేనగర్ కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. దినకరన్ కోవిల్ పట్టి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద నాలుగేళ్లలో ఆర్కే నగర్ ను పట్టించుకోక పోవడం, ప్రజల్లో అసంతృప్తి ఉన్న కారణంగానే గెలుపునకు భయపడి దినకరన్ నియోజకవర్గాన్ని మార్చినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News