భలే టైంలో పెట్టావు బాసూ?

ఏ ముహూర్తంలో పార్టీ పెట్టాడో కాని ఏ మాత్రం కలిసి రావడం లేదు. తాను స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించడంతో సొంత పార్టీని ఏర్పాటు చేసిన [more]

Update: 2020-06-26 18:29 GMT

ఏ ముహూర్తంలో పార్టీ పెట్టాడో కాని ఏ మాత్రం కలిసి రావడం లేదు. తాను స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించడంతో సొంత పార్టీని ఏర్పాటు చేసిన దినకరన్ ఇప్పుడు దాదాపు చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. తమిళనాడులో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం సిద్ధమవుతుందా? అందుకు తగిన బలం ఉందా? అంటే ఏమాత్రం లేదనే చెప్పాలి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

కొత్తపార్టీ పెట్టి…..

జయలలిత వారసత్వం కోసం తొలుత మన్నార్ గుడి మాఫియా ప్రయత్నించింది. జయలలిత ఆస్తులను కాజేయాలని ప్రయత్నించింది. పార్టీని కూడా తన గుప్పిట్లో ఉంచుకునేందుకు అన్ని ప్రయ్నతాలు చేసింది. అయితే జయలలిత వారసులు శశికళ కాదని చెప్పి పార్టీని తమ చేతుల్లోకి సులువుగా తీసుకోగలిగారు. శశికళ అక్రమాస్తుల కేసులో జైలులో ఉండటతో ఆమె మేనల్లుడు దినకరన్ కొత్త పార్టీ పెట్టి తమిళనాడులో సత్తా చాటాలన్నారు.

అన్నాడీఎంకే లక్ష్యంగా…..

దినకరన్ లక్ష్యమంతా అన్నాడీఎంకేనే. అధికారంలో ఉన్న పార్టీని దెబ్బతీయడమే. తన ప్రత్యర్థి అన్నాడీఎంకే అనే భావించారు. డీఎంకేను మిత్రుడిగా భావించినట్లే కనపడింది. ఈ సమయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో దినకరన్ పార్టీకి చుక్కెదురయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితాలు వచ్చినా అది క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయాలే కారణమని చెబుతున్నారు. దినకరన్ పార్టీ పెట్టిన తర్వాత చేసిన ప్రయోగాలు ఫలించలేదు.

వచ్చే ఏడాది ఎన్నికలు…..

దీంతో పాటు కరోనా దినకరన్ కొంప ముంచిందనే చెప్పాలి. తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం, పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. మరికొద్ది నెలల్లోనూ తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నా ఇప్పటి వరకూ బూత్ స్థాయి కార్యకర్తలను కూడా దినకరన్ ఏర్పాటు చేసుకోలేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ ను కావాలనుకుంటున్న దినకరన్ ఆశలు ఫలించే సూచనలు కన్పించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే సగం మంది నేతల పార్టీని వీడిపోయారు. క్యాడర్ లో కూడా నిరాసక్తత కన్పిస్తోంది.

Tags:    

Similar News