ఇక్కడ పార్టీ భ్రష్టుపట్టిపోయింది.. కారణం?

ఇద్దరూ పేరుకు ఒక పార్టీయే. కానీ అక్కడ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అనేసుకుంటున్నారు. చివరకు పోలీసులకు కూడా రెండు వర్గాలు ఒకరిపై [more]

Update: 2020-07-09 00:30 GMT

ఇద్దరూ పేరుకు ఒక పార్టీయే. కానీ అక్కడ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సై అంటే సై అనేసుకుంటున్నారు. చివరకు పోలీసులకు కూడా రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ లో పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గాల మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధిష్టానం కూడా ఎవరికీ సర్ది చెప్పలేని పరిస్థితి నెలకొంది.

గత ఎన్నికల సమయంలో…..

గత ఎన్నికలలో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఓటమి పాలయిన జలగం వెంకట్రావు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఉన్నారు. అయితే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి వీరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. చిన్న విషయాలకు కూడా రెండు వర్గాలు పట్టింపులకు పోతున్నాయి.

మంత్రి పర్యటన సందర్భంగా….

ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కొత్తగూడెం పర్యటన సందర్భంగా మరోసారి వివాదాలు రచ్చకెక్కాయి. మంత్రి పర్యటన సందర్భంగా పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టారు. అయితే జలగం వెంకట్రావు వర్గం కట్టిన ఫ్లెక్సీలను కొందరు చించివేశారు. ఆ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో చించివేశారని జలగం వెంగళరావు వర్గీయులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మంత్రి పువ్వాడ అజయ్ రెండు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

పరస్పర ఫిర్యాదులు…..

అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా కూడా వీరి వార్ మొదలయింది. వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవను ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఆయన వర్గం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై జలగం వర్గీయులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. వనమా రాఘవపై అసభ్య కరంగా పోస్టులు పెట్టడంతో వనమా వర్గం జలగం వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా రెండు వర్గాల ఫిర్యాదులతో పోలీసులు కూడా ఏం చేయలేక పోతున్నారు. ఈ పంచాయతీని పువ్వాడ అజయ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలో ఇద్దరినీ కలపి కూర్చోబెట్టి మాట్లాడతానని కేటీఆర్ చెప్పనట్లు సమాచారం. మొత్తం మీద కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ లో రెండు గ్రూపులు బలంగా ఉండటంతో ఎవరికి సర్దిచెబుతారన్నది చర్చనీయాంశంగా మారింది.

.

Tags:    

Similar News