చరిత్రలో ఈ ఎన్నిక నిలిచిపోతుందా? కాస్ట్ లీ ఎన్నిక కాబోతుందా?

హుజూరాబాద్ ఎన్నికలకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇటు ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీ నిధులను కూడా భారీగా వెచ్చిస్తుంది. దాదాపు నెలన్నర రోజుల నుంచి హుజూరాబాద్ [more]

Update: 2021-08-31 09:30 GMT

హుజూరాబాద్ ఎన్నికలకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇటు ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీ నిధులను కూడా భారీగా వెచ్చిస్తుంది. దాదాపు నెలన్నర రోజుల నుంచి హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఇప్పటికే దాదాపు అనధికారికంగా ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక వివిధ పథకాల అమలుతో విపక్షాలకు ఊపిరి ఆడకుండా చేస్తుంది.

ఇప్పటి వరకూ….

ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. బీజేపీ ఇంతవరకూ పార్టీ నిధులను విడుదల చేయలేదు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో తన పర్యటనలకు, సభలకు తానే ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. ఈటల రాజేందర్ కూడా ఇప్పటికే వంద కోట్ల పైగానే వెచ్చించారని చెబుతున్నారు. పాదయాత్రతో పాటు ఇంటింటికి గడియారాలు పంచడం, కార్యకర్తలను నిత్యం మెయిన్ టెయిన్ చేయడం వంటి ఖర్చులు ఈటల రాజేందర్ కు అధికమయ్యాయంటున్నారు.

ఖర్చు విషయంలో….

అధికార టీఆర్ఎస్ పార్టీ ఖర్చు విషయంలో వెనకాడటం లేదు. మంత్రులు చిన్న పాటి సభ పెట్టినా లక్షల్లో ఖర్చు చేస్తుంది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు ముఖ్య అనుచరులుగా ఉన్న వారిని తన పార్టీలోకి లాగేసుకుంది. ఇక ఓటర్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది. అధికార పార్టీకి ధీటుగా ఖర్చు చేయలేక ఈటల రాజేందర్ ఇబ్బంది పడుతున్నారు.

కాంగ్రెస్ మాత్రం…

కాంగ్రెస్ పార్టీ మాత్రం హుజూరాబాద్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏడేళ్లుగా అధికారంలో లేకపోవడంతో పార్టీ యే ఎన్నిక ఖర్చు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు బరిలోకి దిగినా ఆ ఖర్చును తట్టుకోలేమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద హుజూరాబాద్

Tags:    

Similar News