ఫ్రస్టేషన్ ఎక్కువయినట్లుందే

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పోరు మామూలుగా ఉండేటట్ల కన్పించడం లేదు. ఇప్పుడే తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య యుద్ధం ప్రారంభమయినట్లే [more]

Update: 2019-09-02 18:29 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పోరు మామూలుగా ఉండేటట్ల కన్పించడం లేదు. ఇప్పుడే తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య యుద్ధం ప్రారంభమయినట్లే కన్పిస్తుంది. భౌతిక దాడులకు పరస్పరం దిగుతుండటం ఆందోళన కల్గించే అంశమే. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎవరూ ఎవరికీ తగ్గేట్లు కన్పించేలా లేదు. దీంతో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ముందే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

వరసగా దాడులు….

మొన్న బీజేపీ అధ్యక్షుడిపై దాడి. నిన్న బీజేపీ ఎంపీ కారు ధ్వంసం… మమత బెనర్జీ ఎదుట నిరసనలు ఇవీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో నిత్యం విన్పించే వార్తలు. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతోనే పోరు ప్రారంభమయిందంటారు. బీజేపీ తాము అధికారంలోకి వస్తామని గట్టిగా చెబోతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేతలు సయితం ఒక్కొక్కరుగా బీజేపీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రుేణి నేతలపై బీజేపీ కన్నేసింది.

పార్టీలు మారడంతోనే….

ముఖ్యంగా 24 పరగణాల జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడ పోటీ నువ్వా? నేనా ? అన్నట్లు ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పదుల సంఖ్యంలో టీఎంసీ నేతలు కాషాయ కండువా కప్పుకోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. టీఎంసీ స్థానిక నేతలు దీన్ని సీరియస్ గా తీసుకుని దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తమ పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితులై వస్తే తామేం చేయగలమని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఫ్రస్టేషన్ తోనే…..

కానీ అధికార బలంతో తమ నేతలను ఎగరేసుకుపోతున్నారని బీజేపీపై టీఎంసీ చిందులు తొక్కుతోంది. ముఖ్యంగా మమత బెనర్జీ రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూడో సారి తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంోలకి తేవాలని ఆమె చేయని ప్రయత్నం లేదు. ఆమెలో ఫ్రస్టేషన్ కూడా కొట్టొచ్చినట్లు కన్పిస్తుందంటున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా ఏమాత్రం తగ్గక పోవడంతో పశ్చిమ బెంగాల్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News