రేవంత్ ఇక బయటకు రారా?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డి సైలెన్స్ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ రేవంత్ రెడ్డి సైలెంట్ గా [more]

Update: 2019-01-20 03:30 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డి సైలెన్స్ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రెండుసార్లు కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. తన దూకుడు, వాక్పటిమ, విషయ పరిజ్ఞానంతో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చేవారు. కానీ, ఆయన దూకుడే ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టడంతో రాజకీయ శత్రువులను కూడా పెంచింది. అయితే, తన కొడంగల్ నియోజకవర్గంలో గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు రాజకీయ సవాళ్లు విసిరారు. ఎన్నికల వేళ ఆయన కొడంగల్ తో పాటు చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. ఆయన ప్రాచారానికి కూడా మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ క్యాడర్ లో కూడా రేవంత్ రెడ్డి తమ ఫ్యూచర్ లీడర్ అని అనుకున్నారు. కానీ, ఎన్నికలు ఆయనకు చేదు ఫలితాలే మిగిల్చాయి.

క్యాడర్ లో అయోమయం

కొడంగల్ లో ఆయన ఊహించని విధంగా ఓడిపోయారు. ఓటమిని అంగీకరించిన ఆయన తర్వాత రాజకీయంగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పటినుంచి ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. తాను రెండేళ్ల వరకు మీడియాతో మాట్లాడనని చెప్పారు. అయితే, ఓటమి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కి రేవంత్ రెడ్డి వంటి బలమైన నేత కూడా బయటకు రాకపోవడంతో వారిలో ఇంకా నైరాశ్యం నెలకొంటోంది. ఎన్నికల తర్వాత కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లి వచ్చిన రేవంత్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో కాంగ్రెస్ క్యాడర్ కి అర్థం కావడం లేదు. కేవలం ఆయన నియోజకవర్గంలో మాత్రం రెండుమూడు సార్లు పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల్లో తన క్యాడర్ ను గెలిపించుకునేందుకు ప్రయత్నించారు.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా…

అయితే, తాను ఇన్ని ఆరోపణలు చేసినా ప్రజలు ఈసారి టీఆర్ఎస్ వైపే ఉండటంతో రేవంత్ రెడ్డి కొంచెం డైలమాలో పడ్డారంట. ఓడిపోగానే మళ్లీ విమర్శలకు దిగితే ప్రజల్లో పలుచనకావడంతో పాటు తన వాయిస్ కి విలువ తగ్గుతుందనేది రేవంత్ ఆలోచన అంట. అందుకే కొన్ని నెలల పాటు మీడియాకు, రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాలని నిర్ణయించారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా మీడియాకు మాత్రం దూరంగానే ఉండాలని అనుకుంటున్నారు. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నా… పెద్దగా హైలెట్ కావడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఇక, తనకు, తన రాజకీయ గురువు చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకులైన జగన్, కేసీఆర్ లు కలిసిన ఈ సమయంలోనూ రేవంత్ సైలెంట్ గా రాజకీయాలను గమనిస్తున్నారు కానీ ఎక్కడా మాట్లాడటం లేదు. మొత్తానికి, కొడంగల్ ఓటమి రేవంత్ ను నైతికంగా బాగా దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. మరి, ఈ నైరాశ్యం నుంచి రేవంత్ ఎప్పటికి తేరుకుంటారో… ప్రజలు పాత రేవంత్ ని ఎప్పుడు చూస్తారో మరి.

Tags:    

Similar News