ఉత్కంఠ రేపుతున్న వరల్డ్ కప్ ఫోర్త్ బెర్త్

ప్రపంచ కప్ సెమిస్ ఆశలను ఆ మూడు టీం లు వదులుకున్నాయి. ఇందులో ముఖ్యంగా దిగ్గజ టీం దక్షిణాఫ్రికా కు ప్రపంచ కప్ అచ్చిరాలేదన్నది మరోసారి తేలిపోయింది. [more]

Update: 2019-06-28 02:55 GMT

ప్రపంచ కప్ సెమిస్ ఆశలను ఆ మూడు టీం లు వదులుకున్నాయి. ఇందులో ముఖ్యంగా దిగ్గజ టీం దక్షిణాఫ్రికా కు ప్రపంచ కప్ అచ్చిరాలేదన్నది మరోసారి తేలిపోయింది. ఇక వెస్ట్ ఇండిస్ తాజాగా టీం ఇండియా పై ఓటమి తో సెమిస్ కి ఇక ఛాన్స్ లేనట్లే. వీరితోపాటు ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటికే ఒక్క మ్యాచ్ లో కూడా గెలుపు రుచి చూడక మొట్టమొదటగా క్విట్ అయ్యే టీం అయ్యింది. మరో మూడు టీం లు తాడోపేడో తేల్చుకోనున్నాయి.

ఇక ప్రతీ మ్యాచ్ రసవత్తరమే…

ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో దూసుకుపోవడమే కాదు సెమిస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక టీం ఇండియా రెండొవ స్థానంలో మరొక్క మ్యాచ్ నెగ్గితే సెమిస్ కి చేరుకుంటుంది. మరో నాలుగు మ్యాచ్ లు ఉండటం వాటిలో ఒక్కటి గెలవడం అప్రతిహతంగా దూసుకుపోతున్న కోహ్లీ సేనకు అసాధ్యమేమీ కాదు. ఇక న్యూజిలాండ్ కూడా సెమిస్ బెర్త్ కి ఎంతో దూరం లేదు. ఆ టీం మూడు మ్యాచ్ లలో ఒక్కటి గెలిస్తే సరిపోతుంది. ప్రపంచ కప్ లో సెమిస్ వరకు దూసుకుపోవడం న్యూజిలాండ్ కి అలవాటే. ఇక ఆ జట్టును సెమిస్ చేరకుండా అడ్డగించడం జరిగే పని కాదు. దాంతో ఇప్పటికి మూడు టీం లు దాదాపు సెమిస్ కి వెళ్ళినట్లే. దాంతో నాలుగో బెర్త్ కోసం పోరాటం తీవ్ర స్థాయిలోనే సాగుతూ ఉత్కంఠ రేపనుంది.

వీరికి చావో రేవో ….

ఇందులో ఇంగ్లాండ్ కె నాలుగో బెర్త్ దక్కేలా కనిపిస్తున్నా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు ఇంకా అవకాశాలు మిగిలే వున్నాయి. కాకపోతే ఇంగ్లాండ్ 8 పాయింట్ల తో వుంది. ఆ టీం మూడు మ్యాచ్ లలో రెండు విజయం సాధిస్తే సరిపోతుంది. తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగలుగుతుంది. అదే శ్రీలంక కు మరో నాలుగు మ్యాచ్ లు మిగిలి వున్నాయి. వరుస విజయాలు సాధించగలిగితే లంక ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చి బెర్త్ దక్కించుకునే వీలుంది. బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ మరో మూడు మ్యాచ్ లు ఉండగా ఏడు పాయింట్ల తో వున్నాయి. వచ్చే మ్యాచ్ లన్ని గెలిస్తేనే ఈ రెండు టీం లకు ఛాన్స్ దక్కుతుంది. అయితే ప్రపంచ కప్ లో రాబోయే అన్ని మ్యాచ్ లు అటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లా లకు చావో రేవో.

Tags:    

Similar News