పరిటాల కుటుంబానికి పరుగు తప్పదా?

ఒకప్పుడు అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం అంటేనే ఫేమస్. అన్ని వర్గాల్లోనూ పరిటాలకు అభిమానులుండేవారు. పరిటాల రవి బతికున్నంత వరకూ జిల్లాలో తన పట్టును సడలనివ్వనీయలేదు. పరిటాల [more]

Update: 2020-12-17 05:00 GMT

ఒకప్పుడు అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం అంటేనే ఫేమస్. అన్ని వర్గాల్లోనూ పరిటాలకు అభిమానులుండేవారు. పరిటాల రవి బతికున్నంత వరకూ జిల్లాలో తన పట్టును సడలనివ్వనీయలేదు. పరిటాల ఉన్నాడంటేనే అదొక ధైర్యం. ఆయన కోసం, పార్టీ కోసం ప్రాణమిచ్చే క్యాడర్ ఉండేది. కానీ పరిటాల రవి మరణంతో ఆ కుటుంబం ఆధిపత్యానికి గండిపడిందనే చెప్పాలి. పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ క్యాడర్ లో ధైర్యం నింపలేకపోతున్నారు. దీనికి తోడు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దూకుడు మీద ఉన్నారు.

గత ఎన్నికల్లో ఓటమి…..

రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత ఓడిపోవడమంటేనే అది ఒక రికార్డు. అయితే ఈ రికార్డు బ్రేక్ చేయడానికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి శ్రమ ఒక్కరోజుదో ఒక్క ఏడాదిదో కాదు. దాదాపు పదేళ్ల ఆయన శ్రమకు మొన్నటి ఎన్నికల్లో ఫలితం లభించింది. ఎక్కడ తాగు నీరు లేకపోయినా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సొంత నిధులతో బోర్లు వేయించేవారు. అధికారంలో ఉన్న పరిటాల సునీత పట్టించుకోకపోయినా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాత్రం ప్రజా సమస్యలపై వెంటనే అటెండ్ అయ్యేవారు.

బలం పెంచుకుంటూ…..

దీంతో రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి బలం పెరిగింది. ఎంతగా అంటే అధికారంలో లేకుంటేనే ఇంత శ్రమిస్తున్న ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని భావించేంతగా. మొత్తం మీద తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రాప్తాడులో గెలిచిన నాటి నుంచి నియోజకవర్గాన్ని వదలడం లేదు. ప్రధానంగా నీటి సమస్యను తీర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. రాప్తాడు నియోజకవర్గానికి హంద్రీనీవా కాల్వ నుంచి కృష్ణాజలాలను మళ్లించారు.

కృష్ణా జలాలు తెచ్చి…..

ఇక్కడ విచిత్రమేంటంటే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ని టీడీపీ పెనుకొండ మాజీ ఎమ్మెల్యే డీకే పార్థసారధి సయితం ప్రశంసలతో ముంచెత్తడం. తమ నియోజకవర్గానికి కృష్ణాజలాలు రావడం వెనక తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉన్నారని ఆయన చెప్పడం విశేషం. పెనుకొండ లో తన ప్రత్యర్థి శంకరనారాయణను ఇరుకునపెట్టేందుకు ఆ వ్యాఖ్యలు చేసినా అది నేరుగా పరిటాల కుటుంబానికి తగిలినట్లే అనుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద కృష్ణా జలాలను తెచ్చి వేలాది ఎకరాల్లో పంటలను కాపాడటంతో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అక్కడ స్ట్రాంగ్ అయ్యారని చెప్పాలి. మరి పరిటాల కుటుంబానికి ఇక నియోజకవర్గం మార్చుకోక తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News