సోనూ ను చూసి వీళ్లు సిగ్గుపడటం లేదా?

సోనూ సూద్.. సినిమాల్లో విలన్ పాత్ర చేసుకునే ఒక క్యారెక్టర్. సహజంగా ఆయన పాత్రలు చూసిన ఎవరైనా ఆయనపై నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే మన హీరోలపై [more]

Update: 2020-07-28 00:30 GMT

సోనూ సూద్.. సినిమాల్లో విలన్ పాత్ర చేసుకునే ఒక క్యారెక్టర్. సహజంగా ఆయన పాత్రలు చూసిన ఎవరైనా ఆయనపై నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే మన హీరోలపై ఆరాధ్యభావం అలాంటిది. నిజానికి సోనూ సూద్ వివిధ భాషల్లో అనేక చిత్రాల్లో నటించినా ఆయన సంపాదన మిగిలిన హీరోలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. సోనూ సూద్ రెమ్యునరేషన్ తక్కువయినా ఆయనకున్న ఎమోషన్ మిగిలిన హీరోల్లో కొరవడిందన్న విమర్శలుసర్వత్రా విన్పిస్తున్నాయి.

ఎంతోమందికి దేవుడిలా…..

సోనూ సూద్ ఒక రాష్ట్రానికే కాదు.. కరోనా సమయంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకున్నారు. ప్రధానంగా వలస కార్మికులను ప్రత్యేక బస్సుల్లో తన సొంత ఖర్చుతో స్వస్థలాలకు తరలించారు. కొందరిని ప్రత్యేక విమానంలోనూ తీసుకు వచ్చారు. దీంతో పాటు రైళ్లలో కూడా వేలాది మందిని వారి గమ్యాలకు చేర్చారు. ఇక కిర్గిస్థాన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులను తన సొంత ఖర్చుతో భారత్ కు తరలించారు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. ఇక తాజా సోనూ సూద్ ఒక పేద రైతుకు ట్రాక్టర్ ను బహుకరించిన సంగతి తెలిసిందే.

తగిలించుకోవడానికే స్టార్లు….

ఇప్పుడు సోనూ సూద్ స్పందించిన తీరును చూసి టాలీవుడ్ హీరోలే జెలసీకి లోనవుతున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మ భూషణ్ లను పోటీ పడి తెచ్చుకుంటున్న తెలుగు హీరోలు మాత్రం సేవారంగంలో వెనకబడే ఉన్నారని చెప్పకతప్పదు. ట్యాక్స్ ఎగవేత కోసం సేవా కార్యక్రమాలు చేపడతారు తప్ప స్పందించే గుణం లేదన్నది వాస్తవం. కోట్లు దండుకుంటున్న హీరోలు, వాళ్ల తనయులు పేరుకు ముందు, వెనక స్టార్ లు తగిలించుకోవడం మినహా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంది లేదు. తండ్రి నుంచి మనవళ్ల దాకా ఇండ్రస్ట్రీని ఏలుతున్న ఈ డూప్లికేట్ హీరోలకు కనికరం కూడా లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సోనూ సూద్ వ్యవహారంతో వీళ్లంతా యూత్ దృష్టిలో జీరోలుగా మారారు.

ట్యాక్స్ సోనూ కే కట్టేద్దామంటూ……

ఇప్పుడు ఆపదలో ఉన్న వారి పట్ల సోనూ సూద్ గాడ్ లా మారిపోయారు. ఆయనను సోషల్ మీడియాలో ఆకాశానికెత్తుతున్నారు. ఇకపై మనం చెల్లించే ట్యాక్స్ ను సోనూ సూద్ కు కడతాం అన్న కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎంత కీర్తి సంపాదించుకున్నదే ముఖ్యమని సోనూ సూద్ ను చూస్తుంటే స్పష‌్టమవుతోంది. సోనూ సూద్ నిజమైన భారతరత్నమంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల నుంచి వయసు దాటిపోయినా స్క్రీన్ మీద కొస్తూ కాసులు దండుకుంటున్న మన హీరోలు సోనూ సూద్ ను చూసి సిగ్గు తెచ్చుకోవాలేమో.

Tags:    

Similar News