రంకెలేనా? రఫ్పాడించేది ఏమైనా ఉందా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో తొలి ఎన్నిక జరుగుతుండటం. [more]

Update: 2020-09-30 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో తొలి ఎన్నిక జరుగుతుండటం. మరోది బీజేపీ, జనసేన పొత్తు తర్వాత కూడా ఇదే ఉప ఎన్నిక మొదటిది కావడంతో ఆసక్తికరంగా మారింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ, జనసేనలు తిరుపతి పార్లమెంటు నుంచి పోటీకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఉప ఎన్నికలో….

ఏ ఎన్నిక అయినా బీజేపీ వెనక్కు తగ్గదు. కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప గెలుపు, ఓటములను పట్టించుకోకుండా బీజేపీ బరిలోకి దిగుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం రిజర్వడ్ నియోజకవర్గం. ఇప్పటి వరకూ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ బీజేపీ గెలవలేదు. అలాగని పోటీ చేయకుండా ఉండలేదు కూడా. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీకి మాత్రమే ఇక్కడ గెలిచిన రికార్డులున్నాయి.

రెండు పార్టీలు కలసిన తర్వాత….

అయినా బీజేపీ మాత్రం పోటీ చేయకుండా ఉండదు. అయితే ఈసారి జనసేన, బీజేపీ కలసి ఉండటంలో పోటీ చేయడం ఖాయమంటున్నారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ ఈ ఎన్నికలో తేలిపోతుందంటున్నారు. నిజానికి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని పరిధిలో ఏ శాసనసభ నియోజకవర్గంలోనూ బీజేపీకి పట్టు లేదు. నేతలు తప్ప క్యాడర్ కూడా లేని పార్టీ అది. దీంతో పూర్తిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మా మీదనే ఆధారపడి ఉండాల్సి వస్తుంది.

గెలుపోటములతో సంబంధం లేకుండా…..

మరోవైపు సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను చేప్టటిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడం విశేషం. అయితే ఈ ఎన్నికలో గెలుపోటములు పక్కన పెడితే వీర్రాజు రంకెలకు, పవన్ హార్ష్ ట్వీట్లకు పరీక్ష జరగనుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఎన్నికలో టీడీపీని కలుపుకుని వెళ్లే అవకాశాలు లేకపోవడంతో, బీజేపీ, జనసేన సత్తా ఈ సందర్భంగా బయటపడుతుందన్నది విశ్లేషకుల భావన. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News