ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు ప్రకటించాలి?

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈసారి కరోనా కారణంగా నిబంధనల మధ్యనే ఎన్నికలు జరిగే అవకాశముంది. తమిళనాడు ఎన్నికల [more]

Update: 2020-09-15 17:30 GMT

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈసారి కరోనా కారణంగా నిబంధనల మధ్యనే ఎన్నికలు జరిగే అవకాశముంది. తమిళనాడు ఎన్నికల సమయానికి కరోనా తగ్గితే నిబంధనలు సడిలిస్తారు. లేకుంటే ప్రచారం దగ్గర నుంచి అన్ని పద్ధతిగా సాగాల్సిందే. 2021 లో తమిళనాడు ఎన్నికలు ఉంటాయి. ఇప్పటి వరకూ రజనీకాంత్ పార్టీని ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది.

మూడేళ్ల క్రితం చెప్పినా….

రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు 2017లో ప్రకటించారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా పార్టీ ప్రకటన తలైవా చేయలేదు. మక్కల్ మండ్రం ను స్థాపించి సభ్యత్వాలను అయితే రజనీకాంత్ జోరుగా చేర్పించారు. దాదాపు కోటికిపైగానే సభ్యత్వాలు నమోదయినట్లు మక్కల్ మండ్రం సభ్యులు చెబుతున్నారు. జోరుగా సభ్యత్వాలు వచ్చి చేరడంతో పార్టీకి కూడా మంచి హైప్ వస్తుందని భావించారు. కానీ రజనీకాంత్ ఇంత వరకూ పార్టీని ప్రకటించలేదు.

ఆశగా చూస్తున్న పార్టీలు….

ఇప్పటికే మిగిలిన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్దమయ్యాయి. పొత్తులతో కూటమిని కడుతున్నాయి. తమిళనాడులోని అనేక పార్టీలు రజనీకాంత్ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితే దానితో జత కట్టేందుకు పీఎంకే, డీఎండీకే, మక్కల్ నీది మయ్యమ్ వంటి పార్టీలు రెడీ గా ఉన్నాయి. కానీ రజనీకాంత్ వెంట పార్టీ మాట రాకపోవడంతో వారంతా ఏదో ఒక కూటమిలో చేరిపోయేందుకు సిద్ధమయ్యాయి. సినీ నటులు సయితం రజనీ పార్టీ కోసం వేచి చూస్తున్నారు. లారెన్స్ వంటి వారు కూడా రజనీ కాంత్ పార్టీ పెడితే అందులో చేరి పోటీ చేస్తానని చెబుతుండం విశేషం.

సగం ఊపిరి తీసేశారు…..

రజనీకాంత్ ఇప్పటికే తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాబోనని ప్రకటించారు. దీంతో అభిమానుల్లో నీరసం ఆవహించింది. అదే సమయంలో రాజకీయ పార్టీలు మాత్రం రజనీకాంత్ ముఖ్మమంత్రి పదవి ఆశించకుంటే తాము ఆ పదవి ఆశించవచ్చని ఆ పార్టీ దగ్గరకు చేరాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రజనీకాంత్ మాత్రం పార్టీ ప్రకటన చేయడం లేదు. మరి రజనీకాంత్ పార్టీని ప్రకటించి ఎన్నికల గోదాలో నిలబడతారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags:    

Similar News