ప్రమాదంలో ఆ మూడు “పి” లు

కరోనా వైరస్ ప్రమాదంలో వ్యవస్థలో కీలకమైన ఆ మూడు విభాగాలు పడ్డాయి. పోలీసులు, పొలిటీషియన్స్ , ప్రెస్ ఈ మూడు కూడా ప్రజలతో మమేకం అయ్యే ఉద్యోగాలు [more]

Update: 2020-04-19 09:30 GMT

కరోనా వైరస్ ప్రమాదంలో వ్యవస్థలో కీలకమైన ఆ మూడు విభాగాలు పడ్డాయి. పోలీసులు, పొలిటీషియన్స్ , ప్రెస్ ఈ మూడు కూడా ప్రజలతో మమేకం అయ్యే ఉద్యోగాలు చేయాలిసిన పరిస్థితి. అదే ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సామాజిక దూరం పాటించండి అని ప్రజలకు చెప్పేందుకు ఈ రంగాల్లో ఉన్నవారు జనం లో ఉండే చెప్పాలి. ఇందులో పోలీసులది మరీ క్లిష్టమైన బాధ్యత. లాక్ డౌన్ నిబంధనలు అమలుకు ఫ్రంట్ లైన్ లో ఉండి ఖాకీలు శ్రమిస్తున్న తీరు అంతా ఇంతా కాదు. వీరు అత్యంత సన్నిహితంగా ప్రజలతో మెలుగుతూ ప్రాణాలు పణంగానే పెడుతున్నారని చెప్పాలి. ఇప్పుడు ప్రజలను ఈ మహమ్మారి నుంచి కాపాడటానికి కృషి చేస్తున్న పోలీసులు కి వైరస్ అటాక్ అయితే వారి నుంచి వందలు వేలమందికి సోకే ప్రమాదం పొంచి వుంది. వ్యక్తిగత రక్షణ కల్పించే పీపీఈ లు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న వారికి లేనే లేవు. దీంతో వైద్యులు, తరువాత వ్యక్తిగత రక్షణ కిట్లు పోలీసులకు తక్షణం అవసరం. అందులోను రెడ్ జోన్స్ లో డ్యూటీ చేసేవారికి మరి ముఖ్యం.

కొంప ముంచేలా ఉన్న సేవా కార్యక్రమాలు …

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి పోటీలు పడి మరీ కొందరు రాజకీయ నేతలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు వ్యక్తిగత రక్షణ కొంతవరకు చూసుకున్నా ఇవి అందుకోవడానికి వచ్చే ప్రజలు సామాజిక దూరం కానీ జాగ్రత్తలు కానీ పాటించడం లేదు. దాంతో రాజకీయ నాయకులు ఒక పక్క భయపడుతూనే తప్పక ఆయా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలామంది మాస్క్ లు ధరించకుండానే ప్రజల్లో దూసుకుపోతున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో అధికార పార్టీ కి ఒక నీతి విపక్ష పార్టీలకు మరో నీతిని పోలీసులు అమలు చేయక తప్పడం లేదు. విపక్షపార్టీల వారి సేవా కార్యక్రమాలకు మాత్రం ఖచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నా అధికారపార్టీ నేతలకు మాత్రం ఎలాంటి షరతులు వర్తించడం లేదు. వారు చేసే కార్యక్రమాలవైపు కనీసం పోలీసులు కన్నెత్తి చూడటం లేదు.

మీడియాదీ అదే పరిస్థితి …

పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మీడియా కు వాటిని కవర్ చేసేందుకు ఆ ప్రాంతానికి చేరుకోవాలిసి వస్తుంది. దాంతో అటు జనసందోహం ఇటు నేతల తాకిడి లో సగటు మీడియా జనం సామాజిక దూరం పాటించాలనే నిబంధనలు గాలికి వదిలేయక తప్పడం లేదు. ఫలితంగా కరోనా వైరస్ కి దగ్గరగా మీడియా విధులు నిర్వర్తించాలిసి వస్తుంది. చాలా మందిలో మాకేమి కాదనే నిర్లక్ష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. మీడియా కు పలువురు చేసే చారిటి కార్యక్రమాల్లో కూడా సామాజిక దూరం పాటించకపోవడం తో పాటు రక్షణ చర్యలు అంతంత మాత్రమే కావడం తో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

Tags:    

Similar News