ఆ ముగ్గురు సైకిల్ దిగే పనిలో ఉన్నారా ?

తెలుగుదేశం పార్టీ పై ఇప్పుడు ముప్పేట దాడి మొదలైపోయింది. ఆ పార్టీకి అన్ని వైపులా రాజకీయ శత్రువులు కమ్ముకొస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఎపి లో [more]

Update: 2020-08-13 08:00 GMT

తెలుగుదేశం పార్టీ పై ఇప్పుడు ముప్పేట దాడి మొదలైపోయింది. ఆ పార్టీకి అన్ని వైపులా రాజకీయ శత్రువులు కమ్ముకొస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఎపి లో అధికారంలో ఉన్న వైసిపి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కోటలను సమూలంగా ఆక్రమించుకోవడానికి సన్నద్ధం అయినట్లు అటు హస్తిన నుంచి ఇటు అమరావతి వరకు సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. టిడిపి ఎమ్యెల్యేలపై వైసిపి గురి పెడితే రాజ్యసభ సభ్యుల నుంచి ఎంపీ ల వరకు బిజెపి లాగే ప్రయత్నాలు గట్టిగానే మొదలైనట్లు తెలుస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అనే ఏకైక కార్యాచరణను ప్రస్తుతం రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు రూపొందించే పనిలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.

గల్లా, కేశినేని, కింజరపు అవుట్ కానున్నారా ?

గత కొద్ది కాలంగా టిడిపి నుంచి ఎపి లో గెలిచిన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. గల్లా జయదేవ్ రాజధాని ప్రాంత ఉద్యమం లో సైతం గతంలో చూపిన చొరవ చూపడం లేదు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరుకు టిడిపి ఎంపీ నే అయినా ఢిల్లీ లో ఆయన సన్నిహితంగా మెలిగేది బిజెపి నేతలతోనే. తన హాట్ ట్వీట్స్ తో అప్పుడప్పుడు హల్ చల్ చేసే నాని సైతం ఈ మధ్య కిమ్మనడం లేదు. మరో యువ ఎంపి ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన నాయుడు తన బాబాయ్ అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత దానిపై ఆందోళన చేశారు తప్పితే అమరావతి కి మద్దతుగా చంద్రబాబు కోరుకున్న విధంగా వ్యవహరించడం లేదు. వీరు ముగ్గురు కూడా ఒక మంచి ముహూర్తాన సుజనా బ్యాచ్ లాగే కాషాయం కండువా కప్పేసుకుని లోక్ సభలో టిడిపి ని విలీనం చేసినా చేస్తారనే అంటున్నారు.

బాబు భరోసా ఏమిటి …?

ఎపి లో తాము ఎదగాలంటే ఇంతకాలం తమకు అడ్డుగోడ కడుతున్న టిడిపి ని సమూలంగా తొక్కేయాలన్న వ్యూహం ఇప్పుడు బిజెపి పక్కాగా అమలు చేసేందుకు సిద్ధం అయ్యింది. ఇందులో దయా దాక్షిణ్యాలకు తావు లేవన్న సంకేతాలను ఆ పార్టీ ఇప్పటికే కొత్త అధ్యక్షుడి రూపంలో స్పష్టం గా ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడం చంద్రబాబు కు అసలు సిసలు పరీక్ష పెట్టబోతోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న టిడిపి ని నాశనం చేయడం అంత సులువు కాదన్నది పసుపు పార్టీ లో సీనియర్ల నమ్మకం. అయితే రాజకీయాలంటే వ్యాపార మయం గా నడుస్తున్న తరుణంలో ఎప్పుడో అధికారంలోకి వస్తారో రారో తెలియని చంద్రబాబు ను నమ్ముకుని తమ్ముళ్లు సుదీర్ఘకాలం వేచి చూడలేరని కళ్ళముందు వున్న ఆఫర్స్ వారిని ఊరిస్తే ఎందరు మిగులుతారో తెలియదంటున్నారు విశ్లేషకులు. మరి రాబోయే సైక్లోన్ ను చంద్రబాబు ఎదుర్కొని ఎలా నిలబడబోతున్నారన్నది ఇప్పటి నుంచే చర్చనీయం

Tags:    

Similar News