మూడు నెలలు…. ప్రిపేర్ అయిపోవాల్సిందే?

దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. అయినా వైరస్ ఆగం ఆగం చేస్తుంది. కరోనా కట్టడికి [more]

Update: 2020-03-28 18:29 GMT

దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. అయినా వైరస్ ఆగం ఆగం చేస్తుంది. కరోనా కట్టడికి తొలుత మార్చి 31 వరకు స్వీయ నిర్బంధానికి పిలుపు ఇచ్చిన ప్రధాని ఆ తరువాత పరిస్థితి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఏప్రియల్ 14 వరకు ప్రజలను ఇళ్లనుంచి రావొద్దని ఆదేశించారు. దేశం కోసం ప్రజలు సహకరించాలని పిలుపు నిచ్చారు. మూడు వారాల పాటు లాక్ డౌన్ కి దేశం సిద్ధం అయ్యి చాలావరకు దీనిని విజయవంతంగా అమలు చేస్తుంది.

కేంద్రం చర్యలు… ఆర్బీఐ వరాలు చూస్తే …

త్వరలోనే అనుకోకుండా వచ్చిపడిన కర్ఫ్యూ తొలగిపోతుందని ప్రజలు క్షణం ఒక యుగంగా బతుకు బండి లాగిస్తున్న ప్రజలకు ఒక వరాన్ని ఒక భయాన్ని కలిగించింది కేంద్రం. ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రకటించింది. దీనివెనుకే రిజర్వ్ బ్యాంక్ మూడు నెలలపాటు అన్ని ఈ ఎం ఐ లను వాయిదా వేసింది. ఇవన్నీ గమనిస్తుంటే కరోనా నిర్బంధం దీర్ఘ కాలం సాగే అవకాశాలే కనిపిస్తున్నట్లు అందరికి అర్ధం అవుతుంది.

తప్పని సరి అనిపిస్తోంది……

మరోపక్క కొందరు బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండటం విదేశాలనుంచి జనవరి నుంచి ఇప్పటివరకు 15 లక్షల మంది భారత్ లో ప్రవేశించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో వైరస్ వీరిలో ఎవరికీ ఉందో? వారు ఎవరికి వ్యాపింప చేశారో తెలుసుకోవడం ఇప్పట్లో తేలే వ్యవహారంలా లేదని నెమ్మదిగా అందరికి అర్ధం అవుతుంది. అందుకే దశలవారీగా ప్రభుత్వం ప్రజలను మూడు నెలలపాటు గృహ నిర్బంధంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు మొదలు పెట్టేసిందన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News