ఆ జిల్లాపై జ‌గ‌న్ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశారు. ముఖ్యంగా టీడీపీ కంచుకోట‌ల్లోనూ ఆయ‌న పునాదులు బ‌లంగా వేసుకున్నారు. [more]

Update: 2019-06-16 01:30 GMT

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశారు. ముఖ్యంగా టీడీపీ కంచుకోట‌ల్లోనూ ఆయ‌న పునాదులు బ‌లంగా వేసుకున్నారు. దీంతో ఆయా జిల్లాల నుంచి విజ‌యం సాధించిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు కీల‌కమైన మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చి.. జిల్లాల బాధ్య‌త‌ల‌ను వారి చేతిలో పెట్టార‌నే ప్ర‌చారం ఊపందు కుంది. ఇలాంటి వారిలో కీల‌కంగా ఉన్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నాయ‌కులు. 2014 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రిలో టీడీపీ విజ‌యం ఢంకా మోగించింది. మొత్తం సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్క తాడేప‌ల్లిగూడెంలో మిత్ర‌ప‌క్షం బీజేపీ విజ‌యం సాధించ‌గా.. మిగిలిన సీట్ల‌ను గుండుగుత్తుగా టీడీపీ ద‌క్కించుకుంది.

అలాంటి టీడీపీ కంచుకోట‌లో వైసీపీ భారీ సీట్ల‌ను సొంతం చేసుకుంది. ఇక్క‌డ క్లీన్ స్వీప్ చేయ‌క‌పోయినా.. మొత్తానికి స‌త్తా చాటింది. ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో టీడీపీ రెండు చోట్ల మాత్ర‌మే విజ‌యం సాధించ‌గా.. మిగిలిన 13 స్థానాల్లోనూ వైసీపీ తిరుగులేని విజ‌యం సొంతం చేసుకుంది. దీంతో పార్టీ అధినేత జ‌గ‌న్ ఈ జిల్లాపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టారు. ముగ్గురు నాయ‌కుల‌కు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఉర‌ఫ్ నాని,తానేటి వ‌నిత‌, చెరుకువాడ శ్రీరంగ నాథ‌రాజుల‌కు మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం ఇచ్చారు. అయితే, గ‌తంలో మొత్తానికి మొత్తంగా టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన‌ప్పుడు కూడా ముగ్గురికి చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వ‌లేదు.

కేవ‌లం ఇద్ద‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు. ఒక‌రు బీజేపీ నాయ‌కుడు మాణిక్యాల‌రావు కాగా, రెండో వారు చింత‌ల‌పూడి ఎమ్మెల్యేగా విజ యం సాధించిన పీత‌ల సుజాత‌. త‌ర్వాత ఆమెపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో తొల‌గించి.. కొవ్వూరు నుంచి విజ‌యం సాధించి న కేఎస్ జ‌వ‌హ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చారు. అదేవిధంగా ఆచంట నుంచి విజ‌యం సాధించిన‌ పితాని స‌త్య‌నారా య‌ణ‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం పూర్తి ముందుచూపుతో ఇక్క‌డ ముగ్గురికి అవ‌కాశం ఇచ్చారు. ఈ ముగ్గురు కూడా జిల్లాను వైసీపీకి కంచుకోట‌గా మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అదేవిధంగా వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి తిరుగులేని విధంగా విజ‌యం అందించేందుకు కృషి చేయాలి.

స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఇక‌, టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న కొన్ని నియో జకవ‌ర్గాల్లో ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ హోరా హోరీ పోరు చేయాల్సి వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితిని తేలిక ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఈ ముగ్గురిపైనా ఉంది. అదే విధంగా ప‌శ్చిమ గోదావ‌రిలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిని సొంతం చేసుకున్న రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి విజ‌యం సాధించినమార్గాని భ‌ర‌త్‌కు కూడా పార్ల‌మెంట్‌లో విప్ ప‌ద‌విని అప్ప‌గించారు జ‌గ‌న్‌. బీసీ వ‌ర్గానికి చెందిన భ‌ర‌త్‌కు తొలి విజ‌యంతోనే జ‌గ‌న్ మంచి ప్ర‌యార్టీ ఇచ్చారు. దీంతో ఆయ‌న‌పైనా బాధ్య‌త ప‌డింది. మ‌రి ఈ నలుగురు ఏవిధంగా వైసీపీని ముందుకు తీసుకు వెళ్తారో చూడ‌డం ఒక ఎత్తు అయితే జిల్లాలో అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సి ఉంది. కొల్లేరు స‌మ‌స్య‌ల‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ ప‌నులు, చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తి చేయ‌డం, పోల‌వ‌రం లాంటి కీల‌క ప్రాజెక్టు ప‌నులు స్పీడ‌ప్ అయ్యేలా చేయ‌డం లాంటివి ఇప్పుడు వీరి ముందు ఉన్న పెద్ద ఫ‌జిల్స్‌.

Tags:    

Similar News