రాజుల చరిత్ర ఇక కనుమరుగేనా? అంతా ఒట్టిదేనా?

విజయనగరం రాజుల చరిత్ర చాలా గొప్పది. వందల ఏళ్ళది. నాడు యుధ్ధాలు చేసి మరీ తమ ప్రజలను రాజులు కాపాడారు. తమ ప్రజల యోగక్షేమాలను జాగ్రత్తగా పట్టించుకునేవారు. [more]

Update: 2020-05-24 06:30 GMT

విజయనగరం రాజుల చరిత్ర చాలా గొప్పది. వందల ఏళ్ళది. నాడు యుధ్ధాలు చేసి మరీ తమ ప్రజలను రాజులు కాపాడారు. తమ ప్రజల యోగక్షేమాలను జాగ్రత్తగా పట్టించుకునేవారు. ప్రజాస్వామ్యం కంటే కూడా మిన్నగా పాలన సాగేది. పేదవారికి కూడా న్యాయం జరిగేది. అటువంటి విజయనగరం రాజులు రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే సాధారణ పౌరులు అయిపోయారు. వారి రాజకీయం కూడా జనం వేసే ఓట్ల మీద ఆధారపడిసాగుతోంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూతురు అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ సీట్లో ఓటమి పాలు అయ్యారు.

అన్నీ పోయాయి…

ఇక మూడు నెలల క్రితం అనూహ్యంగా జరిగిన పరిణామాల్లో విజయనగరం రాజుల దాతృత్వానికి ప్రతీకగా దశాబ్దాల నాడు ఏర్పడిన మాన్సాస్ సంస్థ చైర్మన్ పదవి నుంచి కూడా అశోక్ ని తప్పించారు. ఇక ఉత్తరాంధ్రలో ప్రసిధ్ధ పుణ్య క్షేత్రం సింహాచలం దేవస్థానం చైర్మన్ గిరీ కూడా పోయింది. ఇక విజయనగరం కోటలో అశోక్ వైభవం గతానికే పరిమితం అయింది. ఇవన్నీ ఇలా ఉంటే విజయనగరం పట్టణానికే చరిత్రను చెప్పే సాక్షీభూతం మూడు లాంతర్లను అక్కడ నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంతో జనాలు విస్తుబోతున్నారు.

రాజుల నాటిది …..

మూడు లాంతర్లకు చరిత్రలో గొప్ప స్థానం ఉంది. వందల ఏళ్ళ క్రితం వెనక్కు వెళ్తే ఆ రోజుల్లో వీధి దీపాలుగా లాంతర్లే ఉండేవి. విద్యుద్దీపాలు లేవు. దాంతో మూడు లాంతర్లను సాయంత్రం అయితే చాలు వెలిగించి నగరవాసులకు వెలుగు బాట చూపించేందుకు రాజులు ఏర్పాటు చేశారు. ఈ మూడు లాంతర్ల కధ విజయ‌నగరానికే చెందిన గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలోనూ ఇతర రచనల్లో కూడా కనిపిస్తుంది. వందల ఏళ్ల నాటి ఈ మూడులాంతర్లను తొలగించడం పట్ల నగర వాసులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తూంటే ఏకంగా పూసపాటి వారసుడు అశోక్ గజపతి రాజు ఆవేదన చెందితే దానికి మద్దతుగా చంద్రబాబు కూడా వైసీపీ సర్కార్ విధానాన్ని విమర్శించారు.

నిజమేనా…?

ఇదిలా ఉండగా విజయనగరంలో అభివృధ్ధి పనులు జరుగుతున్నాయని, అందువల్లనే మూడు లాంతర్లను ఆ స్థంభాన్ని జాగ్రత్తగా పక్కకు తీసి భద్రపరచారని అదే పూసపాటి వారి వంశానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు చెబుతున్నారు. పునరుధ్ధరణ పనులు పూర్తికాగానే తిరిగి మూడు లాంతర్లను యధాస్థానంలో ప్రతిష్టిస్తారని కూడా ఆమె చెబుతున్నారు. ఈ విషయంలో అనవసరంగా బాబాయ్ అశోక్ కలవరపడుతూంటే చంద్రబాబు సైతం తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆమె అంటున్నారు. అయితే ఈ వివరణ అధికారులు, వైసీపీ మంత్రులు ఇస్తే జనాలకు భరోసాగా ఉండేది. కానీ వైసీపీకి ఏమాత్రం సంబంధంలేని సంచయిత ఇవ్వడం విశేషం. మరి నిజంగా మూడు లాంతర్లు తీరిగి అక్కడే ప్రతిష్టిస్తే విజయనగరం వైభవం మరింత వికసిస్తుంది. అలా కాకుండా చేస్తే మాత్రం రాజుల కూడా చరిత్ర మటుమాయం అవుతుంది. వైసీపీకి చెడ్డపేరు వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News