మూడు రోజులు మూడినట్లేనా?

తెలుగుదేశం పార్టీలో దడ ప్రారంభమయింది. శాసన మండలి రద్దుకు మూడు రోజుల సమయం ఉండటంతో టీడీపీలో ఆందోళన ప్రారంభమయింది. ఇప్పటికే నలుగరు వరకు జారిపోయిన ఎమ్మెల్సీలతో జావగారిపోయిన [more]

Update: 2020-01-24 02:00 GMT

తెలుగుదేశం పార్టీలో దడ ప్రారంభమయింది. శాసన మండలి రద్దుకు మూడు రోజుల సమయం ఉండటంతో టీడీపీలో ఆందోళన ప్రారంభమయింది. ఇప్పటికే నలుగరు వరకు జారిపోయిన ఎమ్మెల్సీలతో జావగారిపోయిన టీడీపీ మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. నేటి నుంచి మూడు రోజుల సమయం ఉంది. శాసనసభలో సోమవారం చర్చించి శాసనమండలి రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

పార్టీలో చేరతే….

మూడురోజుల సమయం ఉండటంతో టీడీపీ ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు వెళతారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలు పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. దాదాపు పదిహేను మంది సభ్యులు అధికార పక్షంలో చేరితే శాసనమండలిలో వైసీపీ బలం పెరిగే అవకాశముంది. ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

వెయిట్ చేయలేక…..

నిజానికి 2021నాటికి గాని 27 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయరు. అప్పటి వరకూ అధికార వైసీపీ వెయిట్ చేయలేదు. అందుకే టీడీపీ నుంచి తమ పార్టీలోకి వస్తే శాసనమండలి రద్దు ఉండదన్న సంకేతాలను పరోక్షంగా మూడు రోజుల సమయం ఇచ్చి పంపిందంటున్నారు. నిజానికి ఫిరాయింపులకు జగన్ వ్యతిరేకం. ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే పదవికి, పార్టీకి రాజీనామా చేసి రావాలని జగన్ ఇప్పటికే చెప్పారు. అయితే శాసనమండలిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జగన్ పార్టీలో వారిని ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయకుండా చేర్చుకునే ఛాన్స్ ఉందంటున్నారు.

జగన్ అంగీకరించడంతో…..

శాననమండలిలో కీలక బిల్లులు రెండింటినీ సెలెక్ట్ కమిటీకి పంపక ముందే కొందరు మంత్రులు జగన్ వద్ద పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్సీలను తీసుకునే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే జగన్ ఇందుకు అంగీకరించలేదు. కానీ నిన్న జరిగిన సీనియర్ మంత్రుల సమావేశంలో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. “మీరు ఓకే అంటే మా ప్రయత్నాలు మేం చేస్తాం. ఎమ్మెల్సీలను తీసుకువస్తాం” అని జగన్ కు మంత్రులు చెప్పగా అందుకు అంగీకరించినట్లు కూడా ప్రచారం ఉంది. మూడు రోజుల సమయంలో ఎంతమంది టీడీపీ నేతలు పార్టీని వీడతారన్నది చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీలు రాకుంటే శాసనమండలిని రద్దు చేయడం తప్పనిసరి అని వైసీీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

Tags:    

Similar News