కొబ్బరి కాయ కొట్టేస్తారా? ముహూర్తం పెట్టేశారా?

మూడు రాజధానుల అంశం ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా సాగింది. ముందుగా హై కోర్టు లో దాఖలైన కేసుల్లో న్యాయస్థానం యధాతథ స్థితి (స్టేటస్ కో) జారీ [more]

Update: 2020-08-11 06:30 GMT

మూడు రాజధానుల అంశం ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా సాగింది. ముందుగా హై కోర్టు లో దాఖలైన కేసుల్లో న్యాయస్థానం యధాతథ స్థితి (స్టేటస్ కో) జారీ చేయడంతో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ సీరియల్ మాదిరి కొనసాగనుంది. ఇది ఆలస్యం అవుతుందని భావించి హై కోు ఆర్డర్ పై స్టే కు సుప్రీం గుమ్మం ఎక్కింది ఎపి సర్కార్. అక్కడ కూడా దీనిపై విచారించి నిర్ణయం ప్రకటించడానికి ఇప్పటికిప్పుడు సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ నెల 14వ తేదీతో….

మరోపక్క హై కోర్టు ఇచ్చిన పదిరోజుల స్టేటస్ కో ఈనెల 14 తో ముగియనుండటంతో ఆగస్టు 16 న విశాఖలో పరిపాలన రాజధానికి జగన్ కొబ్బరికాయ కొట్టేస్తారన్న టాక్ అధికారపార్టీ నుంచి వినవస్తుంది. దీనికి ప్రధాని మోడీ కి కూడా రావాలని ఆహ్వానం పంపారని చెబుతున్నారు.

సర్వత్రా ఉత్కంఠ …

కరోనా వీర విజృంభణ సమయంలో కూడా ఎపి లో మూడు రాజధానులే పొలిటికల్ హీట్ ను పెంచాయి. దాంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనివుంది. ఈనెల 14 న స్టేటస్ కో ను హై కోర్టు పొడిగిస్తే 16 న అధికారపార్టీకి శంఖుస్థాపన చేసే ఛాన్స్ ఉండదు. ఇక విజయదశమి వరకు మంచి ముహుర్తాలు లేవని చెబుతున్నారు. అందుకే ఎందుకైనా మంచిదని వైసిపి సర్కార్ సుప్రీం తలుపు కూడా తట్టి ఉంచడం వల్ల ఆగస్టు లో కాకపోయినా అక్టోబర్ కి మూడు రాజధానుల ప్రక్రియ సజావుగా సాగిపోతుందన్న అంచనాల్లో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. మొత్తానికి ఎపి లో ఈనెల 14 న హై కోర్టు లో జరిగే విచారణ టి ట్వంటీ మ్యాచ్ ను మించిన ఆసక్తిని పెంచడం విశేషం. అయితే కోర్టు కేసులు, ప్రధాని అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో దసరాకు విశాఖలో రాజధానికి శంకుస్థాపన జరిగే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News