Ys jagan : ఆపరేషన్ సక్సెస్.. కంచుకోట బద్దలు

కొందరికి రాజకీయాల్లో అదృష్టం మామూలుగా పట్టదు. పార్టీలు మారినా పదవులు వాటంతట అవే దక్కుతాయి. వ్యక్తిగత బలం కావచ్చు. భవిష్యత్ లో పార్టీకి పనికొస్తారని కావచ్చు. అలాంటి [more]

Update: 2021-11-07 06:30 GMT

కొందరికి రాజకీయాల్లో అదృష్టం మామూలుగా పట్టదు. పార్టీలు మారినా పదవులు వాటంతట అవే దక్కుతాయి. వ్యక్తిగత బలం కావచ్చు. భవిష్యత్ లో పార్టీకి పనికొస్తారని కావచ్చు. అలాంటి నేతల్లో తోట త్రిమూర్తులు ఒకరు. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తన డామినేషన్ ను నిలబెట్టుకుంటారు. వైసీపీలో చేరి అతి కొద్దిరోజుల్లోనే ఎమ్మెల్సీ అయ్యారు. భవిష‌్యత్ లో మరికొన్ని పదవులు కూడా దక్కే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తోట త్రిమూర్తులు సిద్ధమయ్యారు.

వైసీపీలోకి వలసలు…..

తోట త్రిమూర్తులు ఇప్పుడు ఆపరేషన్ మండపేటలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నేతలను వైసీపీలోకి తీసుకురావడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో మంచి విజయాలను సాధించిపెట్టారు. మండపేట మున్సిపాలిటీ కూడా వైసీపీ వశమయింది. తెలుగుదేశం పార్టీలో తనకున్న పరిచయాలతో ముఖ్యమైన నేతలను కూడా వైసీపీలోకి తీసుకువచ్చారు. మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం.

రెండుసార్ల నుంచి ….

వరసగా రెండుసార్లు ఇక్కడ టీడీపీ నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. మండపేటలో వైసీపీ జెండా వచ్చే ఎన్నికల్లో ఎగరాలని తోట త్రిమూర్తులను జగన్ రంగంలోకి దింపారు. నిజానికి తోట త్రిమూర్తులు రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వేణుగోపాల కృష్ణ విజయం సాధించారు. దీంతో సామాజికవర్గం బలంగా ఉన్న మండపేటకు తోట త్రిమూర్తులను జగన్ షిఫ్ట్ చేశారు.

అనుకున్న ప్రకారమే….

జగన్ అనుకున్న ప్రకారమే మండపేటలో వర్క్ అవుట్ అవుతుంది. మండపేటలో ఇప్పుడు వైసీపీ అన్ని రకాలుగా బలోపేతమయింది. తోట త్రిమూర్తులు పూర్తి సమయాన్ని మండపేటకే వినియోగిస్తున్నారు. జగన్ అనుకున్న ప్రకారమే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. వైసీపీ ఇన్ ఛార్జి తోట త్రిమూర్తులను ఎంపిక చేసి జగన్ సక్సెస్ అయ్యారన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్.

Tags:    

Similar News