తోట ఫ్యామిలీకి మ‌రో `ఛాన్స్‌`…?

తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. తోట త్రిమూర్తులు కుటుంబానికి మ‌రో ఛాన్స్ ద‌క్కుతుందా ? తోట త్రిమూర్తులు చాలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారా [more]

Update: 2021-06-30 02:00 GMT

తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. తోట త్రిమూర్తులు కుటుంబానికి మ‌రో ఛాన్స్ ద‌క్కుతుందా ? తోట త్రిమూర్తులు చాలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారా ? అంటే.. వైసీపీ వ‌ర్గాల్లో ఆయ‌న గురించి ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ నాయకుడిగా గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు ఉన్న తోట త్రిమూర్తులు.. కాపు సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు సాధించారు. ముఖ్యంగా రామ‌చంద్రాపురం స‌హా.. జిల్లా వ్యాప్తంగా గ‌ట్టి నేత‌గా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. కాపుల్లో వివాదం త‌లెత్తిన‌ప్పుడు వాటిని ప‌రిష్కరించ‌డంలో ఆయ‌న షార్ప్ ట్రబుల్ షూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. పలు పార్టీలు మారిన తోట త్రిమూర్తులు 2019లో టీడీపీ టికెట్‌పై రామ‌చంద్రాపురం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల‌కు ముందే చంద్రబాబును క‌లిసిన ఆయ‌న త‌న‌కు, త‌న కుమారుడికి రామ‌చంద్రాపురం, కాకినాడ రూర‌ల్ సీట్లు ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టినా బాబు ప‌ట్టించుకోలేదు. ఇక కొద్ది రోజుల క్రింద‌టే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో….?

అప్పటి నుంచి అమలాపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ అధ్యక్షుడిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీగా నామినేటెడ్ చేశారు. గవ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఈ క్రమంలోనే రాజ‌కీయంగా ఒక చ‌ర్చ వ‌చ్చింది. ఇప్పటి కిప్పుడు తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీగా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న కొద్దిగా క‌ష్టప‌డితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం త‌థ్యం. కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు క‌నుక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తారా ? అనేది మిలియ‌న్‌డాల‌ర్ల ప్రశ్న. అయితే.. ఇక్కడే తాజాగా ఒక ట్విస్టు వెలుగు చూసింది.

ఎమ్మెల్సీ గా ఉన్నందున…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తోట త్రిమూర్తులు పోటీకి దూరంగా ఉంటార‌ని, ఎలాగూ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌ ఎమ్మెల్సీ గానే ఉన్నందున పోటీ చేయ‌బోర‌ని ఆయ‌న అనుచ‌రులు గుస‌గుస‌ లాడుతున్నారు. అయితే.. అలాగ‌ని రామ‌చంద్రాపురం స్థానాన్ని మ‌రెవ‌రికో వ‌దిలేసుకునే ప‌రిస్థితిని తోట త్రిమూర్తులు అస్సలు స‌హించ‌లేరు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స‌మాచారం. ఇటీవ‌ల త‌న‌కు ఎమ్మెల్సీగా ప్రమోష‌న్ ఇచ్చిన నేప‌థ్యంలో తోట త్రిమూర్తులు.. సీఎం జ‌గ‌న్‌ను మ‌ర్యాద పూర్వకంగా క‌లిశారు. ఈ క్రమంలో తోట త‌న కుమారుడు తోట పృథ్వీరాజ్ ను కూడా ఆయ‌న త‌న వెంట తీసుకువెళ్లారు.

మండపేట ఇన్ ఛార్జిగా ఉన్నా…?

దీంతో త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్యత్తు గురించి కూడా జ‌గ‌న్ వ‌ద్ద చ‌ర్చించార‌ని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ తాను పోటీ నుంచి త‌ప్పుకోక త‌ప్పని ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికో ఇక్కడ సీటు ఇవ్వడం.. దీనికి త‌న వ‌ర్గం మొత్తం ప్రచారం చేయ‌డం ఎందుకులే అని భావించిన తోట త్రిమూర్తులు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో త‌న కుమారుడుకి ఇస్తే.. గెలిపించుకుంటాన‌ని.. ఈ విష‌యం ఆలోచించాల‌ని సీఎం జ‌గ‌న్ కు వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. రామ‌చంద్రాపురం వ‌దులుకునేందుకు తోట ఏ మాత్రం ఒప్పుకోరు. ఈ నియోజ‌క‌వ‌ర్గమే ఆయ‌న‌కు పునాది.. మూడున్నర ద‌శాబ్దాల అనుబంధం. ప్రస్తుతం ఆయ‌న మండ‌పేట ఇన్‌చార్జ్‌గా ఉన్నా కూడా ఆయ‌న మ‌న‌సంతా ఇక్కడే ఉంది. అయితే తోట త్రిమూర్తులు ప్లాన్లు ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుంటోన్న మంత్రి వేణు కూడా పై ఎత్తులు వేస్తుండడంతో ఇక్కడ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News