చిచ్చు రగులుకుంటోంది

రామచంద్రపురం లో ఆ రెండు సామాజిక వర్గాలు ఉప్పు నిప్పులాగే ఉంటాయి. కారణం అక్కడ కులాల ప్రాతిపదికపై దశాబ్దాలుగా నడుస్తున్న నడిపిస్తున్న రాజకీయం. అదే ఇప్పుడు కొంప [more]

Update: 2019-09-15 12:30 GMT

రామచంద్రపురం లో ఆ రెండు సామాజిక వర్గాలు ఉప్పు నిప్పులాగే ఉంటాయి. కారణం అక్కడ కులాల ప్రాతిపదికపై దశాబ్దాలుగా నడుస్తున్న నడిపిస్తున్న రాజకీయం. అదే ఇప్పుడు కొంప ముంచింది. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేత మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు టిడిపి కి టాటా చెప్పి వైసిపి అధినేత సమక్షంలో అధికారిక తీర్ధం పుచ్చుకున్నారు. ఇక్కడి దాకా బాగానే వుంది. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు కలిసి పనిచేసుకుంటామని సిట్టింగ్ ఎమ్యెల్యే చెల్లుబోయిన వేణుతో సహా అంతా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో చేతులు ఎత్తినా కింది స్థాయి శ్రేణుల్లో ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఫ్లెక్సీలు దహనం చేస్తున్న …

కుల ఆధిపత్య రాజకీయాలతో కంపు కొట్టే నియోజకవర్గాల్లో రామచంద్రపురం కూడా ఒకటి కావడంతో అక్కడ ఒక సామాజికవర్గం టిడిపి లో ఉంటే మరో సామాజిక వర్గం వైసిపి లో ఉంటుంది. తమ కుల నేతలు పార్టీలు మారినప్పుడల్లా ఆయా సామాజికవర్గాలు వారి ఓటు బ్యాంక్ తమ కుల నేతకు అర్పించడం ఆనవాయితీ గా వస్తుంది. గత చరిత్రకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందులోను పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణు తమ కులరాజకీయాలకు స్వస్తి పలుకక తప్పలేదు. దాంతో ఒక సామాజికవర్గంలోని కొందరు బోస్, వేణు, త్రిమూర్తులతో కూడిన ఫ్లెక్సీలకు నిప్పెట్టేశారు. దాంతో రామచంద్రపురం రాజకీయాలే కాదు ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడి వేడిగా మారిపోయాయి. ఈ పరిణామాలను వైసిపి ఎలా చల్లారుస్తుందో చూడాలి.

Tags:    

Similar News