ఈ ఇద్దరికీ ఇబ్బందులు వాళ్లు సృష్టించుకున్నవేనా?

వైసీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ లుగా ఉన్నవాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ గా మారినట్లుంది. దాదాపు ఐదేళ్ల పాటు వైసీపీ వాయిస్ ను [more]

Update: 2020-10-16 11:00 GMT

వైసీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ లుగా ఉన్నవాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ గా మారినట్లుంది. దాదాపు ఐదేళ్ల పాటు వైసీపీ వాయిస్ ను బలంగా విన్పించిన నేతలు అధికారంలోకి రాగానే సొంత పార్టీ నుంచే అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. నిజానికి వీళ్లు సొంత పార్టీ నేతలను మరింత వెనకేసుకు రావాల్సిన సమయంలో వారి నుంచే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అధిష్టానం కూడా ఫైర్ బ్రాండ్లను పెద్గా పట్టించుకోవడం లేదంటున్నారు.

విపక్షంలో ఉన్నప్పుడు……

ఐదేళ్లు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఇందులో ముఖ్యంగా శాసనసభలో ఆర్కే రోజా, బయట అంబటి రాంబాబులు టీడీపీని ఆటాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్కే, రోజా, అంబటి రాంబాబులు ఫైర్ బ్రాండ్లగా వైసీపీలో గుర్తింపు పొందారు. జగన్ అధికారంలోకి రాగానే వీరికి ఖచ్చితంగా పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరినీ అధిష్టానం సయితం పెద్దగా పట్టించుకోవడం లేదు.

సొంత నియోజకవర్గంలోనే……

ఆర్కే రోజాను తీసుకుంటే ఆమె సొంత నియోజకవర్గంలోనే వైరి వర్గాన్ని పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తుంది. ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కకపోయినా ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు జగన్. కేబినెట్ హోదాలో ఆమె హడావిడి చేస్తారనుకున్నారు. కానీ సొంత నియోజకవర్గంలోనే ఆమెకు పార్టీ నేతలు గోతులు తీస్తుండటంతో ఆర్కే రోజా మనోవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. నగరిలో తనను ఒంటరిని చేయాలని పార్టీలోని ఒక వర్గం పనిగట్టుకుని ప్రయత్నిస్తుందని రోజా వర్గం ఆరోపిస్తుంది.

అసంతృప్తి రాజుకున్నా…..

ఇక మరో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పైగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనను వ్యతిరేకించే వర్గం తయారయింది. పైగా అంబటిరాంబాబుకు వ్యతిరేకంగా న్యాయస్థానానికి వెళ్లింది. వీరిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇలా విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నాలుకగా వ్యవహరించిన ఈ ఇద్దరు నేతలు అధికారంలోకి రాగానే ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News