Tdp : ఇద్దరికీ ఇక్కడ కొత్త అభ్యర్థులేనట

ఈసారి విజయవాడ పార్లమెంటు ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండు పార్టీలకూ ఇక్కడ అభ్యర్థులు కొత్త వారే ఉండే అవకాశముంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని [more]

Update: 2021-10-09 00:30 GMT

ఈసారి విజయవాడ పార్లమెంటు ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండు పార్టీలకూ ఇక్కడ అభ్యర్థులు కొత్త వారే ఉండే అవకాశముంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంతో కొత్త నేత ఎంపిక అనివార్యమయింది. ఇక వైసీపీలో గతంలో పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ కు కూడా ఈసారి టిక్కెట్ దక్కడం కష్టమే. వైసీపీ నుంచి కూడా కొత్త నేతను ఎంపిక చేయనున్నారని టాక్.

కమ్మ సామాజికవర్గం నుంచే…

విజయవాడ పార్లమెంటు స్థానానికి ఎవరు పోటీకి దింపినా కమ్మ సామాజికవర్గం నుంచే ఎంపిక చేయాల్సి ఉంటుంది. విజయవాడలో అభ్యర్థులకు కొరత లేకపోయినప్పటికీ ఫ్రెష్ లుక్ తోనే తీసుకురావాలన్నది వైసీీపీ అభిప్రాయంగా ఉంది. ఇక టీడీపీ కూడా కొత్త నేతను ఎంపిక చేయాల్సి ఉంటుంది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది.

వైసీపీ బలంగా…

విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ తూర్పు తప్పించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ బీజేపీ, జనసేన కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల టీడీపీ పుంజుకునే అవకాశముంది.

టీడీపీ కొత్త నేత కోసం….

అందుకే బలమైన పారిశ్రామిక వేత్త కోసం వైసీపీ అధిష్టానం ఎదురు చూస్తుంది. అవసరమైతే దాసరి కుటుంబాన్ని బరిలోకి దించాలని భావిస్తుంది. దాసరి జై రమేష్, బాలవర్థనరావులు టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్నా ప్రస్తుతం వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. ఇక టీడీపీ కూడా మరో పారిశ్రామిక వేత్తను ఎంపిక చేయాల్సిందే. కేశినేని నాని తాను పోటీ చేయనని చెప్పడంతో కొత్త నేత ఎంపిక టీడీపీకి కూడా అనివార్యం కాబోతుంది.

Tags:    

Similar News