మొదట్లో అలా ఉన్న సిక్కోలు.. ఇప్పుడిలా అయిందేంటి?

సిక్కోలు ను చూసి సిగ్గుతెచ్చుకోవాలనుకున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందినా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా అధికారులను [more]

Update: 2020-06-20 09:30 GMT

సిక్కోలు ను చూసి సిగ్గుతెచ్చుకోవాలనుకున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందినా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా అధికారులను ముఖ్యమంత్రి జగన్ సయితం ప్రశంసించారు. మార్చిలో ప్రారంభమైన కరోనా వైరస్ దాదాపు అన్ని జిల్లాలకు వ్యాపించింది. అయితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఈ వ్యాధి మే మొదటి వారం వరకూ దాదాపుగా సోకలేదు.

వెనకబడిన జిల్లాగా…..

శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా. ఇక్కడ ఏప్రిల్ నెల వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారిని కూడా గుర్తించి ఎప్పటికప్పడు అధికారులు చర్యలు తీసుకోవడంతో కరోనా ఫ్రీ జిల్లాగా శ్రీకాకుళం రికార్డు నెలకొల్పింది. అయితే మూడో విడత లాక్ డౌన్ మినహాయింపుల నుంచి కరోనా వైరస్ ఈ జిల్లానూ వణికించడం ప్రారంభించింది.

వలస కార్మికులతో….

శ్రీకాకుళం జిల్లాలో వలస కార్మికులు, మత్స్య కారులు ఎక్కువ. వలస కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉపాధి పొందుతుంటారు. ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వీరు ఎక్కవగా కన్పిస్తారు. లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా విధించడం, వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడంతో శ్రీకాకుళం జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు చెబుతున్నారు. వలస కార్మికుల రాకతోనే వ్యాధి జిల్లాను తాకిందంటున్నారు.

పెరుగుతున్న కేసులు…..

వీరితో పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మత్స్య కారుల నుంచి కూడా వైరస్ జిల్లాలో ప్రవేశించిందనే చెప్పాలి. లాక్ డౌన్ నిబంధలను కట్టుదిట్టంగా అమలు చేసినప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కల్గిస్తుంది. మొన్నటి వరకూ కరోనా ఫ్రీ జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో కేసుల సంఖ్య వంద దాటాయి. మొన్న ఒక్కరోజే 88 కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News