మాధవుడే సారధిగా?

అదేంటో కొన్ని సార్లు ఏళ్ళూ ఊళ్ళూ గడచినా అదృష్టం మాత్రం అసలు చిక్కదు, మరికొన్ని సార్లు అయితే ఇలా తృటిలో తప్పింది అనుకున్న లక్ మళ్ళీ వెంటనే [more]

Update: 2021-05-12 12:30 GMT

అదేంటో కొన్ని సార్లు ఏళ్ళూ ఊళ్ళూ గడచినా అదృష్టం మాత్రం అసలు చిక్కదు, మరికొన్ని సార్లు అయితే ఇలా తృటిలో తప్పింది అనుకున్న లక్ మళ్ళీ వెంటనే దక్కి అక్కున చేర్చుకుంటుంది. విశాఖకు చెందిన బీజీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్ విషయంలో లక్కు నక్కను తొక్కి వస్తోందా అన్న చర్చ అయితే ఉంది. దాదాపు ఏడాది క్రితం ఆయనే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ అని అంతా అనుకున్నారు. ఆయన తండ్రి సీనియర్ మోస్ట్ నేత పీవీ చలపతిరావు ఉమ్మడి ఏపీకి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన వారసుడిగా బీజేపీ జెండా పట్టిన పీవీఎన్ మాధవ్ తండ్రిని మించిన నేతగా బీజేపీలో ఎదిగారు.

బీసీ కార్డుతో …

ఇక బీసీ కార్డు ఆయనకు ఎపుడూ రక్షణ కవచంగా ఉంటోంది. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన నేత కావడం కూడా మరో ప్లస్ పాయింట్. ఎందుకంటే విశాఖలోనే కాస్తో కూస్తో బీజేపీకి బలం కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ నుంచే 2017లో జరిగిన ఎన్నికల్లో మాధవ్ పట్టభద్రుల సీటుకు ఎమ్మెల్సీగా నెగ్గారు. మృదు స్వభావిగా సబ్జెక్ట్ మీద పట్టున్న నేతగా కూడా మాధవ్ పేరు చెబుతారు. అన్నింటికీ మించి ఆయనకు అందరి నేతలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందుకే మాధవ్ కి తప్పిపోయిన ప్రెసిడెంట్ కిరీటం మళ్ళీ దక్కుతుందని లెక్కలు వేస్తున్నారు.

ఆ వర్గం దన్ను ….

ఇక బీజేపీలో బలమైన కమ్మ సామాజిక వర్గం దన్ను కూడా మాధవ్ కి ఉంది అంటున్నారు. విశాఖకే చెందిన మాజీ ఎంపీ హరిబాబు గతంలో ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఇపుడు ఆయన మాధవ్ కి మద్దతు ఇస్తారని అంటున్నారు. అదే విధంగా ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక పెద్దాయన ఆశీస్సులు కూడా మాధవ్ కే ఉన్నాయని చెబుతున్నారు. వీరే కాకుండా జాతీయ కార్యవర్గంలో పలువురు ప్రముఖులు యువకుడు బీసీ అయిన మాధవ్ కి ఒక చాన్స్ ఇచ్చి చూడాలని సూచిస్తున్నారుట.

బాబుకూ ఓకే ….

ఇక బీజేపీలో ప్రస్తుత ప్రెసిడెంట్ సోము వీర్రాజును తప్పిస్తారు అన్న వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. సోము వీర్రాజు నిబద్ధత కలిగిన కార్యకర్తే తప్ప మంచి నాయకుడు మాత్రం కాలేకపోయారు అన్న విమర్శ అయితే పార్టీలోనే ఉంది. ఇక సోము వీర్రాజు ని తప్పించాలన్నదే బీజేపీలో బలమైన మరో వర్గం పట్టుదల. వారికి కుదిరిగే తమ వర్గం నుంచే కొత్త ప్రెసిడెంట్ కావాలని ఉంది. అది కనుక జరగ‌కపొతే బీసీ కార్డుతో మాధవ్ వైపే అంతా మొగ్గు చూపుతారు అంటున్నారు. ఇక బీజేపీతో పొత్తుకు అరాటపడుతున్న చంద్రబాబుకు కూడా మాధవ్ అయితే అభ్యంతరం లేదు అన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి సోము జాతకం తిరగబడితే మాత్రం బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ విశాఖ నుంచే వస్తారన్న ప్రచారం అయితే జోరందుకుంది.

Tags:    

Similar News