టైం నాది… ఇక తేల్చుకుందామా?

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. మాయావతి ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం [more]

Update: 2020-07-28 17:30 GMT

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. మాయావతి ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో మాయవతి తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విప్ ను థిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. దీంతో కాంగ్రెస్ కు మాయావతి షాక్ ఇచ్చినట్లయింది.

వారిదే కీలకం…..

రాజస్థాన్ రాజకీయంలో ఇప్పుడు బీఎస్పీ ఎమ్యెల్యేల పాత్ర కీలకం కానుంది. రాజస్థాన్ ఎన్నికల్లో బీఎస్పీ తరుపున ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అయితే గత ఏడాది ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంది. దీనిని అప్పట్లోనే మాయావతి వ్యతిరేకించారు. బీఎస్పీ గుర్తు మీద గెలిచిన లఖన్ సింగ్, దీప్ చంద్, ఆర్ గుడా, వాజిబ్ ఆలీ, జేఎస్ అవానా, సందీప్ కుమార్ లు కాంగ్రెస్ లో విలీనమయ్యారు. దీనికి స్పీకర్ కూడా ఆమోదించారు.

జాతీయ పార్టీ కావడంతో…..

అయితే బీఎస్పీ జాతీయ పార్టీ కావడంతో విలీనం ప్రసక్తి ఉండదని మాయావతి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో విలీనం అయితే తప్ప వారికి ఇద వర్తించదని చెబుతున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు పార్టీ విప్ వర్తిస్తుందని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను థిక్కరిస్తే అనర్హత వేటు పడే అవకాశముంది. అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేయమని చెప్పడంతో వారంతా ఇప్పుడు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు.

మైనారిటీలో పడిపోయినట్లేనా?

అశోక్ గెహ్లాత్ తనకు 103 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. మాయావతి జారీ చేసిన విప్ తో ఆరుగురు ఎమ్మెల్యేలను కౌంట్ లో నుంచి తీసివేస్తే 97 మంది మాత్రమే ఉంటారు. దీంతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లే. బీఎస్సీ సభ్యుల విలీనానికి సంబంధించి ఇప్పటికే మాయావతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయం సరికాదని సవాల్ చేసిన పిటీషన్ పెండింగ్ లో ఉంది. మాయావతి ఇచ్చిన షాక్ తో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లే.

Tags:    

Similar News