మళ్ళీ హాట్ టాపిక్ గా గాజువాక ?

గాజువాక ఇపుడు విశాఖ కంటే కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పారిశ్రామికవాడగా ఈ ప్రాంతానికి ఎపుడూ ప్రాధాన్యత ఉంది. ఇదిలా ఉంటే గాజువాక 2009లో ఏర్పాడిన తరువాత [more]

Update: 2021-08-22 15:30 GMT

గాజువాక ఇపుడు విశాఖ కంటే కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పారిశ్రామికవాడగా ఈ ప్రాంతానికి ఎపుడూ ప్రాధాన్యత ఉంది. ఇదిలా ఉంటే గాజువాక 2009లో ఏర్పాడిన తరువాత అక్కడ రాజకీయం ఎపుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. 2009లో ప్రధాన పార్టీలను కాదని అక్కడ జనం కొత్తగా వచ్చిన ప్రజారాజ్యానికి ఓటేసి గెలిపించారు. ఇక 2014 నాటికి టీడీపీ గెలిస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇలా ప్రతీ ఎన్నికలోనూ విలక్షణతను చూపిస్తూ పార్టీల రాజకీయాన్ని తారుమారు చేస్తున్న ఘనత గాజువాక ఓటర్లదే.

ఉక్కు చెక్కేస్తుందా..?

విశాఖ ఉక్కు కర్మాగారం గాజువాకలోనే ఉంది. విశాఖకే కాదు, ఏపీకి తలమానికం లాంటి ఈ ప్లాంట్ ప్రైవేట్ చేసేందుకు కేంద్రం దూకుడు చేస్తోంది. దాంతో వేలాదిగా ఉన్న కార్మిక లోకం అగ్గి రాజేస్తోంది. గాజువాకలో ఉక్కు కార్మికులే మెజారిటీగా ఉంటారు. వారి దయ ఉంటేనే ఎవరైనా రాజు అయ్యేది. దాంతో ఈసారి ఉక్కు సమస్య గాజువాకలో నేతల రాజకీయాలను తిరగరాస్తాయని అంటున్నారు. అదే విధంగా ప్రధాన పార్టీలకు కూడా చుక్కలు చూపించడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

పోటా పోటీ …

గతసారి గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈసారి ఆయనకు గెలుపు అంత సులువు కాదు అంటున్నారు. అదే నేపధ్యంలో ఆయన వారసులకు కూడా జగన్ టికెట్లు ఇవ్వరని చెబుతున్నారు. గాజుకలో స్టీల్ ప్లాంట్ లీడర్ గా ఉంటూ మొత్తం అటునుంచి కధ నరుక్కువస్తున్న మంత్రి రాజశేఖర్ కి ఈసారి వైసీపీ టికెట్ ఇచ్చి ఉక్కు సెగ నుంచి తప్పించుకుంటుంది అంటున్నారు. అదే విధంగా టీడీపీ తరఫున కూడా ఉక్కు పోరాటం చేసిన వారికే ఎంపిక చేస్తారుట. పొత్తు టీడీపీతో ఉంటే జనసేన నుంచి ఉక్కు నేపధ్యం ఉన్న కోన తాతారావు బరిలో ఉంటారని అంటున్నారు.

ఇజ్జత్ మే సవాల్…

గాజువాకతో పాటు అటు పెందుర్తి, విశాఖ పశ్చిమ ఉత్తర నియోజకవర్గాల మీద విశాఖ ఉక్కు పోరాటం ప్రభావం పడుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో దానికి ధీటుగా అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నారు అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రీవేటీకరణ జరిగితే ఒకలా జరగకపోతే మరోలా ఇక్కడ సీన్ ఉంటుంది. మొత్తానికి ఈసారి కూడా అందరినీ గాజువాక అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు. గతసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసిన సంగతి విదితమే. మొత్తానికి విశాఖ ఉక్కు కాదు కానీ అన్ని రాజకీయ పార్టీల రాజకీయ సరదా ఈసారి తీర్చేసేలా కధ సాగుతుంది అంటున్నారు

Tags:    

Similar News