ఫిక్స్ చేశారట.. ఇంతకు మించి అవకాశం లేదట

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎవరికి వారు గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 117. ఈసారి డీఎంకే [more]

Update: 2021-02-19 17:30 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎవరికి వారు గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 117. ఈసారి డీఎంకే విజయంపై ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రాకపోవడంతో తమ విజయం ఖాయమని డీఎంకే గట్టిగా విశ్వసిస్తుంది. అందుకే వేసే ప్రతి అడుగూ ఆచితూచి వేయాలని డీఎంకే నేత స్టాలిన్ నిర్ణయించారు.

కూటమిలోని పార్టీలతో…..

అయితే కూటమిలోని పార్టీలే డీఎంకే కు స్టాలిన్ కు అడ్డంకిగా మారాయి. వాళ్లు గెలవకపోగా తమ విజయానికి అడ్డుపడే అవకాశముందని డీఎంకే భావిస్తుంది. అందుకే తొలి నుంచి డీఎంకే సీట్ల పంపకంపై స్పష్టతతో ఉంది. ఈసారి గతంలో మాదిరి సీట్లు ఇవ్వలేమని ముందు నుంచి చెబుతూ వస్తూ కూటమిలోని పార్టీలను మానసికంగా సిద్ధమవుతుంది. డీఎంకే కూటమిలో దాదాపు ఎనిమిది పార్టీలున్నాయి. వీరందరికి సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

ఎక్కువ స్థానాల్లో డీఎంకే….

అందుకోసమే డీఎంకే 180 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కూటమిలోని పార్టీలు ఏమనుకున్నా తన నిర్ణయాన్ని మార్చుకోకూడదని భావిస్తుంది. కూటమిలోని ఎనిమిది పార్టీలకు 54 సీట్లను మాత్రమే కేటాయించాలని డీఎంకే నిశ్చయించింది. కాంగ్రెస్ కు కేవలం ఇరవై స్థానాలను మాత్రమే ఇవ్వనుంది. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో 40 స్థానాలు ఇస్తే ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది. అందుకే ఈసారి సగం సీట్లకు తగ్గించింది.

తలా కొంచెం…..

కాంగ్రెస్ కు ఇరవై స్థానాలు ఇవ్వగా మిగిలిన 34 స్థానాలు ఏడు పార్టీలకు ఇవ్వనున్నారు. ఎండీఎంకేకు 10, డీపీఐ, సీపీఐ, సీపీఎంలకు కలిపి ఎనిమిది సీట్లను కేటాయించనున్నారు. మిగిలిన 16 స్థానాల్లో ఇండియన్ ముస్లింలీగ్, మనిదనేయ మక్కల్ కచ్చి, కొంగునాడు మక్కల్ కట్చి, తమిళ వాళ్వురిమై పార్టీలకు సీట్ల పంపణీ చేయనున్నారు. 180 స్థానాలలో డీఎంకే అభ్యర్థులు పోటీ చేస్తే గుర్తు ప్రభావంతో మ్యాజిక్ ఫిగర్ చేరుకవచ్చన్నది డీఎంకే అంచనా. మొత్తం మీద డీఎంకే అధినేత స్టాలిన్ సీట్లను ఫిక్స్ చేశారు.

Tags:    

Similar News