అచ్చెన్న, బుచ్చన్నలు సీన్ రివైండ్ చేయాలా?

నిన్న గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరును ప్రశంసించారు. ఇదే మాదిరిగా శాసనసభ సమావేశాలు జరగాలని ఆయన కోరుకున్నారు. నరసింహన్ ప్రశంలు కురిపించి 24గంటలు [more]

Update: 2019-07-23 06:30 GMT

నిన్న గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరును ప్రశంసించారు. ఇదే మాదిరిగా శాసనసభ సమావేశాలు జరగాలని ఆయన కోరుకున్నారు. నరసింహన్ ప్రశంలు కురిపించి 24గంటలు గడవక ముందే ముగ్గురు తెలుగుదేశం శాసనసభ్యులు సభ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. దీనిపై అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలు ఘాటుగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్ జరిగిందని, నియంత పాలన నడుస్తోందని విమర్శలు గుప్పించారు.

అప్పటి వాటి మాటేమిటి….?

అయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సస్పెన్షన్ల విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 67 మంది శాసనసభ్యులతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీి సభ్యులను గత శాసనసభ సమావేశాల్లో సస్పెండ్ చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసినప్పుడు ఏమైందని వైసీీపీ నేతలు నిలదీస్తున్నారు. ఆనాటి శాసనసభలో తమ నేత జగన్మోహన్ రెడ్డికి మైకు ఇవ్వడమే అరుదు అని వారు గుర్తు చేస్తున్నారు.

చరిత్రలో జరగలేదంటూ…

కానీ సభ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు తెలుగుదేశం శాసనసభ్యులు పార్టీ శాసనసభ పక్ష ఉప నేతలు. చరిత్రలో ఎప్పుడూ శాసనసభ పక్ష ఉప నేతలను సస్పెండ్ చేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. సభలో ప్రభుత్వం తమకు సంబంధించిన వీడియోల ప్రదర్శనకు మాత్రమే అనుమతిస్తుందని, ప్రతిపక్షం వీడియోలు ప్రదర్శిస్తామంటే అంగీకరించడం లేదని తప్పుపడుతున్నారు. స్పీకర్ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు.

కసి తీర్చుకుంటున్నారంటున్న….

ఇలా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సస్పెన్షకు గురై మనోవేదన చెందిన వైసీపీ… ఇప్పుడు ఆ కసి తీర్చుకుంటుందన్న విమర్శలయితే బాగానే విన్పిస్తున్నాయి. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారని భావిస్తే ఒకరోజు సస్పెండ్ చేస్తారని, బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేయడమేంటున్నారు టీడీపీ నేతలు. తాము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటున్నారు. జగన్ తన పాదయాత్రలో నలభై ఐదేళ్లకే అందరికీ పింఛను ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే మాట మారుస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. మొత్తం మీద ఏపీ శాసనసభలో గత సీన్స్ రిపీట్ అవుతున్నాయన్నది వాస్తవం.

Tags:    

Similar News