వారు కూడా జంపేనా?

రాజ‌కీయంగా చైత‌న్యవంత‌మైన జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి కీల‌క‌మైన నాయ‌కులు రాష్ట్రంలో చ‌క్రం తిప్పారు. ముఖ్యంగా చంద్రబాబు ఇక్కడ ఎద‌గాల‌ని నిర్ణయించుకుని బాగానే కృషి చేసింది. ఇటీవ‌ల [more]

Update: 2019-07-22 11:00 GMT

రాజ‌కీయంగా చైత‌న్యవంత‌మైన జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి కీల‌క‌మైన నాయ‌కులు రాష్ట్రంలో చ‌క్రం తిప్పారు. ముఖ్యంగా చంద్రబాబు ఇక్కడ ఎద‌గాల‌ని నిర్ణయించుకుని బాగానే కృషి చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన నాయ‌కుల‌కే ఇక్కడ టికెట్లు కూడా ఇచ్చింది. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో నెల్లూరు మొత్తాన్ని కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఏ ఒక్క సీటును కూడా టీడీపీకి వ‌ద‌ల కుండా గుండుగుత్తుగా జ‌గ‌న్ గెలుచుకుపోయారు. దీంతో ఇప్పుడు టీడీపీ ఇక్కడ ఒంట‌రి అయిపోయింది. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన నాయ‌కులు త‌మ భ‌విష్యత్తు ఏంటి? అని చ‌ర్చించుకుంటున్నారు.

ఎదగలేదని….

ప్రస్తుతం జ‌గ‌న్ పాల‌న‌, ప్రతిప‌క్ష నేత‌గా ఉన్న చంద్రబాబు.. త‌న అనుభ‌వాన్ని రంగ‌రించ‌లేక పోవ‌డం వంటి ప‌రిణామాలను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. జ‌గ‌న్‌, చంద్రబాబు ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితిలోనే రాబోయే ఐదేళ్లపాటు ఉంటే.. టీడీపీ ఇక కోలు కోవ‌డం క‌ష్టమేన‌ని అంచ‌నా వేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎత్తి చూపుతున్న చంద్రబాబు పాల‌న‌ లోపాల‌ను బ‌లంగా ఎదుర్కొనే ప‌రిస్థితి టీడీపీలో లేక పోవ‌డం, జ‌గ‌న్ దూకుడుగా సంక్షేమాన్ని ముందు రోజు నుంచి అమ‌లు చేయ‌డంతో టీడీపీ కోలుకోవ‌డం, పుంజుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం అనేది మ‌బ్బుల్లో నీళ్ల మాదిరిగానే ఉంటుంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాషాయం కండువా కప్పుకునేందుకు….

ఈ నేప‌థ్యంలోనే నెల్లూరుకు చెందిన టీడీపీ సీనియ‌ర్లు, మాజీ మంత్రులు సొమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి, బొల్లినేని శీనయ్య, పొంగూరి నారాయ‌ణ‌, ప‌ర‌సా ర‌త్నం, మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామ‌కృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రరెడ్డి వంటి వారు త‌మ రాజ‌కీయ భ‌విష్యత్తుకు సంబంధించి స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లి తాల అనంతరం ఇప్పటి వ‌ర‌కు సోమిరెడ్డి, నారాయ‌ణ‌లు కేవ‌లం ఒక్కసారంటే ఒక్కసారే.. చంద్రబాబును క‌లిసి ముక్త సరిగా మాట్లాడి వెళ్లారు. దీంతో వారు టీడీపీకి దూర‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి. ఇక‌, ఇటీవ‌ల కాలంలో బీజేపీ దూకుడు పెర‌గ‌డంతో వీరిలో చాలా మంది కాషాయం క‌ప్పుకొనేందుకు రెడీ అవుతున్నార‌ట‌.

దారి చూసుకుంటున్నారు….

ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి బీజేపీకి గూటికి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌, మంత్రి నారాయ‌ణ కుదిరితే.. వైసీపీ లేదంటే.. బీజేపీ అని జంప్ చేసేందుకు త‌న‌కు అనుకూలంగా ఉన్న పార్టీని ఎంచుకుంటున్నా ర‌ట. కురుగొండ్ల ఇప్పటికే వైసీపీకి ట‌చ్‌లోకి వ‌చ్చారు. మాజీమంత్రి ప‌ర‌సా ర‌త్నం వంటి వారు ఏకంగా రాజ‌కీయాల‌కు దూరమ‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది. అయితే, ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఏంటంటే.. పోలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డి ని మాత్రం ఏ పార్టీ కూడా చేర్చుకునే ప్రస‌క్తిలేద‌ని తెలుస్తోంది. సో.. మొత్తానికి నెల్లూరు త‌మ్ముళ్లు త‌మ దారి తాము చూసుకున్నార‌న్న మాట‌. చంద్రబాబు ఎలా ఈ సమస్యను అధిగమిస్తారో చూడాలి.

Tags:    

Similar News