బిగ్ బ్రేకింగ్ : కుప్పకూలిన కుమార సర్కార్

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అందరూ ఊహించినట్లే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. కుమారస్వామి తనకు తానే పెట్టుకున్న విశ్వాస పరీక్షలో నెగ్గుకు రాలేకపోయారు. సభలో బలం లేకపోవడంతో [more]

Update: 2019-07-23 14:11 GMT

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అందరూ ఊహించినట్లే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. కుమారస్వామి తనకు తానే పెట్టుకున్న విశ్వాస పరీక్షలో నెగ్గుకు రాలేకపోయారు. సభలో బలం లేకపోవడంతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత వారం రోజులుగా జరుగుతున్న కర్ణాటక రాజకీయం మెగా టీవీ సీరియల్ ను తలపిస్తోంది. విశ్వాస పరీక్ష ప్రతి రోజూ వాయిదా పడుతూ వస్తోంది.

నాటకీయ పరిణామాల మధ్య….

దీంతో స్పీకర్ రమేష్ ఈరోజు ఖచ్చితంగా విశ్వాస పరీక్షను నిర్వహిస్తానని చెప్పారు. ఈరోజు కూడా కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కుమారస్వామి ఈరోజు ఉదయం తండ్రి దేవెగౌడతో సమావేశమై చర్చించారు. మధ్యాహ్నం వరకూ శాసనసభకు రాలేదు. మరోవైపు సిద్ధరామయ్య కూడా సభకు రాకపోవడంతో బీజేపీ సభ్యులు అనుమానపడ్డారు. కోరం లేకుండా మరోసారి సభను వాయిదా వేస్తారని ఆందోళన చెందారు. అయితే స్పీకర్ రమేష్ కుమార్ 7.24 నిమిషాలకు ఓటింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ తలుపులు మూసి మరీ ఎమ్మెల్యేలను తొలుత లెక్కించారు. డివిజన్ పద్ధతిలో బలపరీక్షను నిర్వహించారు.

సభలో బలాబలాలివే….

ఈరోజు శాసనసభకు 205 మంది సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నుంచి 101 మంది సభకు వచ్చారు. సభకు అసంతృప్త ఎమ్మెల్యేలు 15 మంది సభకు హాజరు కాలేదు. ఇక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా సభకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనారోగ్యంతో గైర్హాజరయ్యారు. మొత్తం 20 మంది సభ్యులు సభకు హాజరు కాకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 103 గా ఉంది. స్పీకర్ ను మినహాయిస్తే కాంగ్రెస్, జేడీఎస్ బలం 99 మంది మాత్రమే. బీఎస్పీ సభ్యుడు సభకు హాజరు కాలేదు. బీజేపీ సభ్యులు 105 మంది హాజరయ్యారు. బలం బీజేపీవైపే ఉండటంతో కుమారస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గుకురాలేకపోయారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోక తప్పలేదు.

Tags:    

Similar News