అయిదేళ్ళ ముందే అన్న గారు వచ్చి ఉంటే… ?

ఎన్టీయార్ అంటేనే ఒక ఆవేశం అని చెప్పాలి. ఆయన ఆలోచనలన్నీ కూడా సరికొత్త విప్లవంగా విశ్లేషించాలి. అలాగని ఆయన దూకుడుగా ఉంటారని కాదు. ఆయన మనసులో మధనపడిన [more]

Update: 2021-05-29 05:00 GMT

ఎన్టీయార్ అంటేనే ఒక ఆవేశం అని చెప్పాలి. ఆయన ఆలోచనలన్నీ కూడా సరికొత్త విప్లవంగా విశ్లేషించాలి. అలాగని ఆయన దూకుడుగా ఉంటారని కాదు. ఆయన మనసులో మధనపడిన తరువాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ మీదట అది శిలాశాసనమే. ఇదిలా ఉంటే ఎన్టీయార్ శత జయంతికి చేరువ అవుతున్న వేళ ఆయన గురించి ఇంకా తెలియని ఎన్నో విషయాలు అలా బయటకు వస్తూనే ఉన్నాయి. ఎన్టీయార్ కి రాజకీయాలు అంటే పడదని అంతా అనుకుంటారు. కానీ ఆయనకు నాడు తెలుగు నాట ఉన్న అందరి రాజకీయ నాయకులతో మంచి స్నేహ బాధవ్యాలు ఉన్నాయి. అలాగే ఎన్టీయార్ సినిమాల్లో సందేశం ఉంది, ఆయన గుండెల్లో తెలుగుదేశం ఉంది.

అలా అంకురార్పరణ …

ఎన్టీయార్ 1982 మార్చి 29న తెలుగుదేశం పేరిట పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో సంచలనం రేపారు. దానికి కొన్నేళ్ళ ముందు అంటే 1978లోనే ఆయన పార్టీ పెట్టాల్సి ఉందిట. అదే విధంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆనాడే జరగాల్సిందిట. దానికి దారి తీసిన కారణాలు కూడా చాలా ఉన్నాయి. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ తనకు ఉన్న పాపులారిటీని బాగా కోల్పోయారు. ఫలితంగా అప్పటిదాకా అప్రతిహతంగా సాగిన కాంగ్రెస్ కోటలు కూలిపోయి కేంద్రంలో తొలిసారిగా జనతా సర్కార్ 1977లో ఏర్పాటు అయింది. ఆ మరుసటి ఏడాది ఉమ్మడి ఏపీలో శాసనసభ ఎన్నికలు జరిగే వేళ కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ జెండా, ఇందిరమ్మ బొమ్మ ఉంటే గెలవమని కొందరు కీలక నాయకులు రెడ్డి కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. మరో వైపు జనతా పార్టీ కూడా ఏపీలో వేళ్ళూనుకుంటోంది.

నో చెప్పారా ….?

కాంగ్రెస్ బక్కచిక్కి ఉందని భావించిన కమ్మ సామాజికవర్గం నేతలు తమకూ ఒక పార్టీ ఉండాలని భావించారుట. అలా వారు తమ కులంలో పాపులర్ నటుడిగా ఉంటూ తెలుగు వారికి దైవ సమానంగా ఉన్న ఎన్టీయార్ ని రాజకీయాల్లోకి రమ్మని కోరారట. కొత్త పార్టీ పెట్టి ఎన్టీయార్ వస్తే కచ్చితంగా అప్పటి రాజకీయ శూన్యత కారణంగా అన్న గారి పార్టీ గెలిచి తీరుతుందని కూడా వారు లెక్కలు వేశారట. అయితే వారు చెప్పినది అంతా విన్న ఎన్టీయార్ తాను అరవై ఏళ్ల దాకా సినిమా రంగంలోనే ఉంటానని, అపుడే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని మాట ఇచ్చారని పాత కధ ఒకటి ప్రచారం లో ఉంది.

బాబు కోసమే …?

అది ఎంత నిజమో తెలియదు కానీ ఎన్టీయార్ కనుక 1978లోనే పార్టీ పెడితే మాత్రం కచ్చితంగా చంద్రబాబు అనే రాజకీయ నాయకుడు పుట్టకపోయి ఉండేవారు అన్నది వాస్తవం. చంద్రబాబు యువజన కాంగ్రెస్ నేతగా ఉంటూ ఇందిరా కాంగ్రెస్ తరఫున తొలిసారి 1978లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత అంజయ్య జంబోజెట్ మంత్రివర్గంలో 70 మంది మంత్రుల్లో ఒకరుగా కుర్చీ ఎక్కి ఆ హోదాతో ఎన్టీయార్ అల్లుడు కాగలిగారు. అంటే ఎన్టీయారే 1978లో రాజకీయాల్లోకి వస్తే ఇక చంద్రబాబు నాయుడు అన్న పాత్ర కూడా తెలుగు రాజకీయాల్లో ఉండేది కాదు అన్న చర్చ కూడా ఉంది. ఆయన అయిదేళ్ళ పాటు తన రాజకీయ రంగ ప్రవేశాన్ని వాయిదా వేసుకున్నది, తెలుగుదేశం పార్టీ పెట్టింది అంతా చంద్రబాబు కోసమే అన్నట్లుగానే చెప్పాలేమో. మొత్తానికి ఎన్టీయార్ వైపు నుంచి చూసుకున్నా చంద్రబాబు అంతటి రాజకీయ అదృష్టవంతుడు వేరే ఉండరేమో.

Tags:    

Similar News