వణికిపోతున్న న్యాయవ్యవస్థ…ఎ”లా” డీల్ చేయాలో?

ప్రస్తుతం న్యాయవ్యవస్థకు అందరిలాగే కరోనా సంక్షోభం గడ్డు పరిస్థితినే తెచ్చిపెట్టింది. ఇందులో న్యాయవాదులు, న్యాయ వాద గుమాస్తాలు మొదలు కొని వీరిపై ఆధారపడిన జిరాక్స్ సెంటర్స్ వరకు [more]

Update: 2020-05-02 18:29 GMT

ప్రస్తుతం న్యాయవ్యవస్థకు అందరిలాగే కరోనా సంక్షోభం గడ్డు పరిస్థితినే తెచ్చిపెట్టింది. ఇందులో న్యాయవాదులు, న్యాయ వాద గుమాస్తాలు మొదలు కొని వీరిపై ఆధారపడిన జిరాక్స్ సెంటర్స్ వరకు లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా కోలుకోలేమన్న తీరును భవిష్యత్తు రూపంలో కళ్ళముందే కదులుతుంది. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో న్యాయ వాదులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 60 వేలమందికి పైనే వీరి సంఖ్య ఉంది. వీరిలో చెప్పుకోవాలంటే 80 శాతం మందికి న్యాయస్థానాలు నడవకకపోతే జీవనభృతి కష్టమే. గతంలో లా కిట కిటలాడేలా కోర్టు లు పనిచేయడం జరగదు. కనీసం వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనేవరకు సామాజిక దూరం పాటిస్తూనే న్యాయస్థానాలు తమ విధులు నిర్వర్తించుకోవాలి. ఇది కింది న్యాయస్థానాల్లో సాధ్యమయ్యే పని కాదు.

తగిన సౌకర్యాలు ఏవి …?

దేశంలో న్యాయవ్యవస్థ దీనపరిస్థితి లోనే వుంది. కేసుల సంఖ్యకు అనుగుణంగా గాని, జనాభాకు అనుగుణంగా కానీ న్యాయస్థానాలు ఏర్పాటు కాలేదు, అలాగే సౌకర్యాల కొరత వెంటాడుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ కేసుల సంఖ్యను తగ్గించుకోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విచారణలు సాగించడం కింది కోర్టు ల్లో జరిగే పని కాదు. వాదీ, ప్రతివాదుల సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించాలి, క్రాస్ ఎగ్జామినేషన్ వంటివి న్యాయస్థానాల్లోనే చేపట్టాలి. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా అన్ని సాధ్యం కావు. వాది, ప్రతివాదులు సమర్పించే పత్రాలు అసలైనవా, నకిలీవా తేల్చడం వీడియో కాల్స్ తో సాధ్యం కానీ పనే. ఇలా అనేక సమస్యలు దిగువస్థాయి కోర్టులకు ఎదురు కానున్నాయి.

యువ న్యాయ వాదులకు అసలైన సవాల్ …

ప్రస్తుతం న్యాయ వాద వృత్తిని నమ్ముకుని ఇందులోకి వచ్చిన యువ న్యాయవాదులకు క్లయింట్స్ ఇచ్చే అరకొర డబ్బే జీవనాధారం. సీనియర్ న్యాయవాదులు ఎవ్వరూ వారికి జీతాలు 99 శాతం ఇచ్చే పరిస్థితి లేనే లేదు. అరకొరగా వచ్చే సంపాదనతోనే వీరు జీవితాన్ని నెట్టుకు రావలిసిందే. ఒక దశాబ్ద కాలం తరువాత వృత్తిలో స్థిరపడితే తప్ప అప్పటివరకు ఆర్థికస్థితి గందరగోళమే. ఎపి లో న్యాయవాదుల సమస్యలు గమనించే గత ఎన్నికల ముందు వైసిపి పార్టీ వారికి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించింది అంటే వీరి దీనస్థితి ఎలాంటిదో చెప్పక్కర్లేదు. అలాంటి వృత్తిలో కొనసాగుతున్న వారికి ఇప్పుడు కరోనా మహమ్మారి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు పడి వీరి జీవితాలు దుర్భరంగా మార్చేసింది. మరి ఈ కష్టాలనుంచి ఎప్పటికి ఈ వర్గం గట్టెక్కుతుందో కాలమే తేలుస్తుంది.

Tags:    

Similar News