ఫ్రెండ్స్ ఇక లేనట్లేనా?

మిత్రులందరూ ఒక్కొక్కరుగా బీజేపీకి దూరమవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ వైఖరి కారణంగా అప్పటి వరకూ దాని వెంట ఉన్న మిత్ర పక్షాలన్నీ ఒక్కొక్కటిగా [more]

Update: 2019-12-25 17:30 GMT

మిత్రులందరూ ఒక్కొక్కరుగా బీజేపీకి దూరమవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ వైఖరి కారణంగా అప్పటి వరకూ దాని వెంట ఉన్న మిత్ర పక్షాలన్నీ ఒక్కొక్కటిగా తప్పుకుంటుండటం ఆందోళన కల్గించే అంశమే. కేంద్రంలో బలంగా ఉన్న బీజీపీని సయితం మిత్ర పక్షాలు లెక్క చేయడం లేదు. రాష్ట్రాల్లో మాత్రం తమ బలం పెంచుకోవడానికే ప్రాంతీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి. అందుకే ఒక్కొక్కరూ దూరం అవుతున్నారు.

వారిని వీక్ చేయాలని….

నిజానికి వివిధ రాష్ట్రాల్లో తమతో కలసి ఉన్న ప్రాంతీయ పార్టీలను వీక్ చేయడం లక్ష్యంగా బీజేపీ వ్యూహరచనలు చేస్తుంది. 2014 ఎన్నికల్లో నాటి నుంచే రాష్ట్రాల్లో మిత్రులుగా ఉన్న వారిని వదిలించుకునేందుకే బీజేపీ సిద్ధమయింది. ఇందుకు ప్రధాన కారణం ఒంటరిగా ఆయా రాష్ట్రాల్లో బలపడాలన్న అత్యాశ బీజేపీకి నమ్మకమైన మిత్రులను కోల్పోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ వ్యూహం బెడిసి కొడుతున్నట్లు కన్పిస్తోంది.

ప్రయోగం విఫలం కావడంతో….

బీజేపీఈ ప్రయోగం చేసి విఫలమయిన చోట కాంగ్రెస్ శక్తిమంతం అవుతుంది. ఇది ఒకరకంగా బీజేపీ కాంగ్రెస్ కు ఊపిరిపోస్తుందనే చెప్పాలి. మహారాష్ట్రలో మూడు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రుడిగా ఉన్న శివసేనను బీజేపీ దూరం చేసుకుంది. శివసేనది గొంతెమ్మ కోర్కెలా? కావా? అన్నది పక్కన పెడితే నష్టపోయింది బీజేపీయే అని చెప్పాలి. మహారాష్ట్రలో ఎవరూ ఊహించిని విధంగా కాంగ్రెస్ శివసనేతో చేతులు కలపి బీజేపీ షాక్ ఇచ్చింది.

ఒక్కొక్కరూ దూరంగా…..

ఇక జార్ఖండ్ లోనూ గత ప్రభుత్వంలో మిత్రుడిగా ఉన్న ఆల్ స్టూడెంట్స్ జార్ఖండ్ యూనియన్ ను కూడా ఎన్నికల్లో కలుపుకుని పోవక పోవడం వల్లనే ఈ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ నమ్మకమైన మిత్రుడిగా ఉన్న చంద్రబాబును కావాలని బీజేపీ దూరం చేసుకుంది. ఫలితంగా నోటాకు వచ్చిన ఓట్లు కూడా బీజేపీ తెచ్చుకోలేకపోయింది. ఇలా వరసగా మిత్రులను బీజేపీ దూరం చేసుకుంటడం, వారిని కాంగ్రెస్ ను దరి చేర్చుకోవడం ఆ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బంది కల్గించే అంశమేనని చెప్పాలి.

Tags:    

Similar News