వీక్ గా ఉన్న వారిని చూసి

భారతీయ జనతా పార్టీ విపక్షాలపై గురిపెట్టింది. వీక్ గా ఉన్న పార్టీల నుంచి ఎక్కువ మందిని చేర్చుకుని తాను బలపడాలని ప్రయత్నిస్తోంది. ప్రధానంగా రాజ్యసభ లో బీజేపీ [more]

Update: 2019-07-25 17:30 GMT

భారతీయ జనతా పార్టీ విపక్షాలపై గురిపెట్టింది. వీక్ గా ఉన్న పార్టీల నుంచి ఎక్కువ మందిని చేర్చుకుని తాను బలపడాలని ప్రయత్నిస్తోంది. ప్రధానంగా రాజ్యసభ లో బీజేపీ బలం తక్కువగా ఉంది. కీలకమైన బిల్లులను ఆమోదింప చేసుకోవాలన్నా కష్టంగా మారింది. ముఖ్యమైన ట్రిపుల్ తలాక్, పౌరసత్వం బిల్లు వంటి వాటిలో మిత్రపక్షాలు సయితం ఎదురు తిరిగే అవకాశముంది. దీంతో బీజేపీ పెద్దల సభలో బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇప్పటికే ఐదుగురిని చేర్చుకుని…

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను ఆకర్షించి ఆ పార్టీని రాజ్యసభలో విలీనం చేసుకోగలిగింది. అలాగే ఇటీవల సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ ను కూడా కమలం వలలో వేసుకోగలిగింది. నీరజ్ శేఖర్ తో పాటు మరికొందరు సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో త్వరలోనే చేరే అవకాశముందని తెలుస్తోంది.

బలం లేకపోవడంతో….

రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుండగా అందులో భారతీయ జనతా పార్టీ బలం కేవలం 78 మంది మాత్రమే. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తర్వాత వచ్చే ఏడాదికి కాని ఆ పార్టీ బలం రాజ్యసభలో పెరిగే అవకాశాలు లేవు. అందుకనే కీలక బిల్లుల ఆమోదం కోసం ముందుగానే ఇతర పార్టీల నుంచి రాజ్యసభ సభ్యులను చేర్చుకోవడం ద్వారా బలాన్ని పెంచుకోవాలని కమలనాధులు భావిస్తున్నారు.

వీక్ గా ఉన్న పార్టీలపై…..

ఈ మేరకు ఆపరేషన్ ప్రారంభమయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలపై మోదీ, అమిత్ షాలు దృష్టి పెట్టినట్లు సమాచారం. రాజ్యసభలో బలం పెంచుకోగలిగితేనే ఈ ఐదేళ్లలో తాము తీసుకునే నిర్ణయాలు అమలు అయ్యే అవకాశముంటుంది. అందుకోసం అన్ని రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల కోసం ఆపరేషన్ ప్రారంభమయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద కమలం పార్టీ ఎవరైనా పర్లేదు.. రాజ్యసభ సభ్యుడైతే కండువా కప్పేయాలని చూస్తోంది.

Tags:    

Similar News