ట్రంప్ గెలిస్తేనే భారత్ కు లాభమా?

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు నవంబరు నెలలో జరగనున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్, డెమొక్రాట్ అధ్యక్ష్య అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జోబిడైన్ లు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఎవరు [more]

Update: 2020-10-06 16:30 GMT

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు నవంబరు నెలలో జరగనున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్, డెమొక్రాట్ అధ్యక్ష్య అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జోబిడైన్ లు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఎవరు గెలిస్తే భారత్ కు లాభం అన్న చర్చ జరుగుతోంది. ట్రంప్ వల్లనే భారత్ కు లాభమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. చైనా, పాకిస్థాన్ లతో భారత్ కు ఉన్న విభేదాల్లో ట్రంప్ భారత్ వైపు మొగ్గుచూపుతారంటున్నారు. మళ్లీ ట్రంప్ గెలిస్తే భారత్ కు ఆయన బలమైన మిత్రుడుగా వ్యవహరిస్తారంటున్నారు.

చైనా అంటేనే…..

ట్రంప్ చైనా అంటేనే మండిపడుతున్నారు. కరోనా వ్యాప్తికి చైనా కారణమని ఇప్పటికే తన ప్రచారంలోనూ ట్రంప్ ప్రస్తావిస్తున్నారు. కరోనా వైరస్ విషయాన్ని చైనా దాచిపెట్టడంతోనే అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగానే ట్రంప్ ఇమేజ్ పూర్తిగా అట్టడుగు స్థాయికి పడిపోయింది. చైనా తనను ఓడించడానికి కుట్ర పన్నిందని కూడా ట్రంప్ ఆరోపించారు. దీంతో ట్రంప్ చైనా అంటేనే మండిపడుతున్నారు. ట్రంప్ తిరిగి ఎన్నికైతే చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తారని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డెమొక్రాట్లు కూడా భారత్ కు….

నిజానికి డెమొక్రాట్లు కూడా భారత్ వైపు మొగ్గు చూపుతుంటారు. జోబిడెన్ కూడా కొంత భారత్ కు మద్దతు ప్రకటించినా ట్రంప్ మాదిరిగా ఎఫెన్స్ గా భారత్ విషయంలో ఉండరన్నది అందరి అభిప్రాయం. ప్రధానంగా ట్రంప్ చేసిన అమెరికా ఫస్ట్ నినాదం ఆయనను భారతీయుల నుంచి దూరం చేసింది. తిరిగి అమెరికాలో స్థిరపడిన భారతీయుల మద్దతు పొందేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాల వీడియోలను ప్రదర్శిస్తూ భారతీయులను ఆకట్టుకునేందుకు ట్రంప్ అష్టకష్టాలు పడుతున్నారు.

శ్రమిస్తున్న ట్రంప్….

దీంతో పాటు కరోనాతో ట్రంప్ ఇమేజ్ పడిపోయిందని అందరికీ తెలిసిందే. రెండు లక్షలకు మందికిపైగానే అమెరికాలో కరోనాతో మరణించారు. ట్రంప్ నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాప్తి జరిగిందని అత్యథికులు విశ్వసిస్తుండటంతో దాని నుంచి బయటపడేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ తెచ్చి ప్రజలను ఆకట్టుకోవాలని శ్రమిస్తున్నారు. ట్రంప్ గెలిస్తేనే భారత్ కు బలమైన మద్దతుదారుగా ఉంటారన్న అంతర్జాతీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. మరి ఎవరు గెలిస్తే ఎవరికి లాభం అన్న విషయాన్ని పక్కన పెడితే ట్రంప్ గెలవడం అంత సులువు కాదన్నది ఎన్నికల ప్రచారం, వెలువడుతున్న సర్వేలను బట్టి స్పష్టమవుతుంది.

Tags:    

Similar News