ఇద్దరికీ చెడిందా ….?

ఇద్దరూ తెలుగుదేశం పార్టీ లో రాజ్యసభ సభ్యులు అయ్యారు. కేంద్రంలో బిజెపికి రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్ కి తెరతీసింది. అదను కోసం చూస్తున్న సుజనా [more]

Update: 2019-09-17 03:30 GMT

ఇద్దరూ తెలుగుదేశం పార్టీ లో రాజ్యసభ సభ్యులు అయ్యారు. కేంద్రంలో బిజెపికి రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్ కి తెరతీసింది. అదను కోసం చూస్తున్న సుజనా చౌదరి బ్యాచ్ నలుగురు తమ పార్లమెంటరీ పార్టీని కాషాయంలో విలీనం చేసినట్లు ప్రకటించి గోడదూకేశారు. వీరిలో టిజి వెంకటేష్ కి సుజనా చౌదరి ల నడుమ మంచి స్నేహమే వుంది. ఆ స్నేహమే అయిష్టం అయినా వెంకటేష్ ను గోడదూకేసాలా చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తమపై వేటు వేయకుండా ఉండాలంటే జంప్ చేయడానికి టిజి మద్దతు సుజనాకు తప్పలేదు. దాంతో ఆయన బలవంతంగా తమ మిత్రుడితో కూడా జై కొట్టించేశారు. ఆ విషయం వెంకటేష్ సైతం బాహాటంగానే అంగీకరించారు కూడా.

ఇప్పుడు ఇద్దరిది తలోదారి…

మిత్రులు ఇద్దరు ప్రస్తుతం అధికారికంగానే బిజెపి సభ్యులు. దీనిపై చంద్రబాబు ధర్మ పోరాటం వంటి కార్యక్రమాలు కూడా ఎలాంటివి చేయలేదు. అంతా ఆయన ఆశీస్సులతోనే దూకేశారని అర్ధం చేసుకున్నారు. అది ఇలా ఉంటే ఇప్పుడు మిత్రులు బిజెపి నుంచి రెండు గొంతుకలు వినిపిస్తుండటం చర్చనీయంగా మారింది. అమరావతి లోనే రాజధాని ఉండి తీరాలన్నది సుజనా చౌదరి డిమాండ్. కానీ వెంకటేష్ రాయలసీమ ను రాజధాని చేయాలంటున్నారు.

రాజధాని విషయంలో…..

చంద్రబాబు తాత్కాలిక రాజధాని కట్టారంటే అసలు రాజధాని లేనట్టేగా అంటున్నారు టిజి వెంకటేష్. అంతే కాదు రాజధాని మార్చే ఉద్దేశ్యం లేకపోతే కనీసం రెండో రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో బిజెపి లో వినిపిస్తున్న ఈ ధోరణి విమర్శలకు మరింత దారితీస్తుంది. సుజనా చౌదరి – టిజి వెంకటేష్ ల నడుమ విభేదాల వల్లే భిన్న వాదనలు ఒకే పార్టీ నుంచి వినిపిస్తున్నాయని కొందరు భావిస్తుంటే మరికొందరు కమలం పార్టీ వ్యూహంలో భాగంగానే టిజి వెంకటేష్ తో ఇలా మాట్లాడించి ఉండొచ్చని అంటున్నారు. ఈ రాబోయే రోజులలో వీరిద్దరూ ఇలాగే వుంటారా లేక ఒకే మాట మాట్లాడతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News