క్రేజ్ ఉంటుందనే వీళ్లకు టిక్కెట్లా…??

రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. ప్ర‌తి పార్టీలోనూ రాజ‌కీయం వినూత్న కోణానికి చేరుకుంది. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీలు అధికారంలోకి వ‌చ్చేందుకు త‌మ త‌మ‌పంథాల్లో దూసుకుపోతున్నాయి. ఈక్ర‌మంలోనే ఆయా పార్టీలు [more]

Update: 2019-02-01 14:30 GMT

రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. ప్ర‌తి పార్టీలోనూ రాజ‌కీయం వినూత్న కోణానికి చేరుకుంది. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీలు అధికారంలోకి వ‌చ్చేందుకు త‌మ త‌మ‌పంథాల్లో దూసుకుపోతున్నాయి. ఈక్ర‌మంలోనే ఆయా పార్టీలు త‌మ‌కు అనుకూలంగా ఉండే రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీల టికెట్లు సైతం కొత్త‌వారికి ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స్థానిక నేత‌లకు కాకుండా రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్నింటిలో అమెరికా పౌరుస‌త్వం ఉన్న నాయ‌కులను కూడా ఏరికోరి ఎంపిక చేస్తున్నాయి. దీనికి అనేక కార‌ణాలు మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

క్రేజ్ ఉంటుందనేనా?

అమెరికాలో ఇప్ప‌టికే స్థిర‌ప‌డి, అక్క‌డి పౌర‌స‌త్వాన్ని కూడా క‌లిగి ఉన్న‌వారు(వీటిని వ‌దులుకుంటున్నారు లేండి) ఏపీలో అయితే, భారీ ఎత్తున నిధులు ఖ‌ర్చు చేస్తార‌ని పార్టీలు త‌ల‌పోస్తున్నాయి. దీనికితోడు అమెరికా నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌పై ప్ర‌జ‌ల్లో ఓ విధమైన క్రేజ్ ఉంటుంద‌ని కూడా పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్టీలు ఏరికోరి వారిని ఎంపిక చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీలు ఇదే బాట‌లో న‌డుస్తున్నాయి. ఈ విష‌యంలో టీడీపీ క‌న్నా కూడా వైసీపీ ఒకింత దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు టికెట్‌ను కొఠారు అబ్బ‌య్య చౌద‌రికి క‌న్ఫ‌ర్మ్ చేసింది.

వీరిద్దరూ కూడా….

ఆయ‌న దూసుకుపోతున్నారు కూడా. ఈయ‌న అమెరికాలో ఉద్యోగం చేసుకునేవారు. గ్రీన్ కార్డు కోసం అప్ల‌య్ చేసుకు న్న ద‌శ‌లో వైసీపీ ఆహ్వానంతో వ‌చ్చేవారు. ఇక‌, గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో వైసీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగిన విడ‌ద‌ల ర‌జ‌నీ కుమారి కూడా అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. కేవ‌లం ఎన్నిక‌ల కోసమే టికెట్ కోస‌మే ఆమె ఏపీకి వ‌చ్చారు. అదేవిధంగా తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ద‌గ్గుబాటి హితేష్ చెంచురామ్‌కు ఏకంగా కొన్నేళ్లుగా అమెరికా పౌర‌స‌త్వం ఉంది. ఆయ‌న కూడా దీనిని వ‌దులుకుంటాన‌ని చెబుతున్నారు. అయితే, వైసీపీ టికెట్ ఇస్తే.. అనే క్లాజ్ పెడుతున్నారు.

గెలిచిన తర్వాత…..

టీడీపీ విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ ప‌శ్చిమ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కుమార్తె షాబానుకు కేటాయించే చాన్స్ క‌నిపిస్తోంది. ఈమెకూడా అమెరికా పౌర‌స‌త్వాన్ని క‌లిగి ఉన్నారు. బాబు ఓకే అంటే..ఆమె కూడా దీనిని ర‌ద్దు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు అయితే. వీరంతా గెలిచిన త‌ర్వాత ఏపీలోనే ఉంటారా? అనేది ప్ర‌శ్న‌. ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున ఖ‌ర్చు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న వీరు గెలుపు గుర్రాలెక్కినా.. మ‌నుషులు ఇక్క‌డ‌, మ‌న‌సులు అమెరికాలో అంటే ప్ర‌జ‌ల ప‌రిస్తితి ఏంటి? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News