అధికార బలం అక్కడ ఉందట

చంద్రబాబు తాను అపర చాణక్యుడినని చెప్పుకుంటారు. ఆయన వ్యూహలకు తిరుగులేదనుకుంటారు. ఒంటిచేత్తో పార్టీని నడుతున్న తాను ఎవరినైనా ఇట్టే గెలిపిస్తానని కూడా చెబుతూంటారు. అయితే చంద్రబాబు రాజకీయ [more]

Update: 2019-08-08 13:30 GMT

చంద్రబాబు తాను అపర చాణక్యుడినని చెప్పుకుంటారు. ఆయన వ్యూహలకు తిరుగులేదనుకుంటారు. ఒంటిచేత్తో పార్టీని నడుతున్న తాను ఎవరినైనా ఇట్టే గెలిపిస్తానని కూడా చెబుతూంటారు. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం మొదట ఇందిరా కాంగ్రెస్ తో మొదలైంది. ఆయన ఇందిరమ్మ గాలిలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మంత్రి కూడా అయ్యారు. ఇక మామ ఎన్టీయార్ పార్టీ పెట్టడంతో అందులో చేరి అక్కడ సెకండ్ పొజిషన్ కి వచ్చేశారు. తరువాత రోజుల్లో అదే మామను కుర్చీ నుంచి కూలదోసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ తన ఘనతగానే చంద్రబాబు చెప్పుకుంటారు. బాగానే ఉంది కానీ చంద్రబాబు సొంతంగా పోటీ చేసి గెలిచినదెపుడన్నదే కమలనాధుల ప్రశ్న. 1995 నుంచి 1999 వరకూ తొలి అయిదేళ్ళు మామ అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు 1999లో బీజేపీ వాజ్ పేయి తో పొత్తు పెట్టుకుని గెలిచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. .

మేము లేకపోతేనా….

చంద్రబాబును ఏపీలో ఓండించింది జగన్ కాదు మేము అంటున్నారు ఏపీ బీజేపీ ఇంఛార్జి సునిల్ డియోధర్. ఆయన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ఓ పెద్ద ఎంటర్టైన్మెంట్ గా మారాయన్నది నిజం. ఆయన ఇంతకు ముందు తమ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి గుత్తకు ఇచ్చామని, ఆ పార్టీని గెలిపించామని చెప్పారు. తాజాగా అనంతపురం టూర్లో మాట్లాడుతూ చంద్రబాబు ఓటమికి తామే కారణమని చెప్తున్నారు. తమతో జట్టు కట్టకపోవడం వల్లనే చంద్రబాబు మాజీ సీఎం అయ్యారని సునీల్ లాజిక్ పాయింట్ తీశారు. అసలు చంద్రబాబుకు అధికారం రావాలంటే బీజేపీ ఉండాల్సిందేనని కూడా ఆయన చంద్రబాబు రాజకీయ విజయ సూత్రాన్నే చెబుతున్నారు.

పదేళ్ల వియోగం….

2004లో ఓడిపోయిన తరువాత బీజేపీతో కటీఫ్ చేసుకున్న చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలసినా గెలవలేదని సునీల్ కనిపెట్టిన సత్యాన్ని విప్పి చెబుతున్నారు. మళ్ళీ 2014లో బీజేపీ చేయి పట్టుకుంటేనె ఆయనకు సీఎం పీఠం దక్కిందని అంటున్నారు. ఇపుడు విడిపోయాక మాజీ అయ్యారని, అయితే చంద్రబాబు మళ్ళీ బీజేపీ దగ్గరకు వచ్చినా చేరదీయమని ఆయన అంటున్నారు. మరి చంద్రబాబుకు అధికారం దక్కడం కల్ల అని కూడా జోస్యం చెప్పేస్తున్నారు. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ చూస్తే నోటా కంటే తక్కువగా ఉంటోంది, మరి ఆ పార్టీ చంద్రబాబుని సీఎం చేశానని చెబుతోంది. ఇపుడు జగన్ ని కూడా తామే చేశామని అంటోంది. మరి ఇంతటి బలం ఉంటే 2024లో మీరే ఆ పీఠం ఎక్కేయరాదూ అంటున్నారు అటు తమ్ముళ్ళు. ఇటు వైసీపీ నేతలు.

Tags:    

Similar News