“బ్రాండ్” భజాయిస్తున్నారు.. గ్రౌండ్ లో అలా లేదంటున్నారు

ఎక్కడైనా విపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తాయి. తమ వద్ద ఉన్న ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఏదైనా కుంభకోణం జరిగితే దాని ఆనవాళ్లు బయటపడేంత వరకూ [more]

Update: 2020-05-06 09:30 GMT

ఎక్కడైనా విపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తాయి. తమ వద్ద ఉన్న ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఏదైనా కుంభకోణం జరిగితే దాని ఆనవాళ్లు బయటపడేంత వరకూ పోరాడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలది వింత వాదనగా కన్పిస్తుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపక్షాల రెండు కుంభకోణాలు బయటపెట్టాయి. వాటిలో ఒకటిది ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు ఒకటి కాగా, రెండోది నాసిరకం మద్యం పేరుతో వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేస్తుందన్నది.

ర్యాపిడ్ టెస్ట్ కొనుగోలులోనూ….

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం అని విపక్షాలు నెత్తిమొత్తుకున్నా దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టలేకపోయాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సోదరుడికే కాంట్రాక్టు ఇచ్చారన్న విషయాన్ని నిరూపించలేకపోయాయి. బీజేపీ, టీడీపీలు విమర్శలు చేసినా చివరకు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న బుగ్గన సవాల్ ను కూడా విపక్షాలు స్వీకరించ లేకపోయాయి. ఐసీఎంఆర్ సూచనల మేరకే కొనుగోలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం కన్నా తాము తక్కువ ధరకు కొన్నామని వైసీపీ సర్కార్ వాదిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని విపక్షాలు వదిలేశాయి.

మద్యం బ్రాండ్ల విషయంలో…..

ఇక తాజాగా మద్యం బ్రాండ్ల విషయాన్ని తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. ఏపీ ప్రజలకు నాసిరకం బ్రాండ్లను అంటగట్టి ఎక్కువ మొత్తాన్ని ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుందన్నది టీడీపీ విమర్శ. ఇందుకోసం జగన్ ప్రభుత్వం డిస్టలరీలతో ఒప్పందం కుదుర్చుకుని కమీషన్లు భారీగా దండుకుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండ పిచ్చి బ్రాండ్లు తాగి ప్రజలు పక్షవాతానికి గురవుతున్నారని కూడా ఆయన చెప్పారు. డిస్టలరీలన్నీ ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని చెప్పారు.

ప్రభుత్వ షాపులేనంటూ….

కానీ ప్రభుత్వం మాత్ర గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అనుమతించిన డిస్టలరీల నుంచే ప్రభుత్వం ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తుందని వైసీపీ చెబుతోంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చని కూడా అంటోంది. ఏపీలో ప్రభుత్వమే షాపులు నడుపుతుండటంతో పిచ్చి మద్యం అమ్మి అనారోగ్యం పాలయితే ఆ అప్రదిష్ట తమకే కదా? అని వారు వాదిస్తున్నారు. అయితే దేనికీ సరైన ఆధారాలు లేవని, ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే బ్రాండ్ బాబులు విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో కరోనా కట్టడి కంటే కుంభకోణాలపైనే అధికార, విపక్షాల దృష్టి ఉందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News