మారరంటే మారరట

చంద్రబాబు మార‌రంటే మార‌రు..! మాట విన‌రంటే విన‌రు..! వింటారు.. ఎవ‌రి మాటంటే.. భ‌జ‌న‌ప‌రుల మాట‌..! వాస్తవికత‌ను వ‌క్రీక‌రించి చెప్పేవారి మాట‌..! లేనిది ఉన్నట్టు అతిగా స్పందించేవారి మాట‌..! [more]

Update: 2019-08-15 13:30 GMT

చంద్రబాబు మార‌రంటే మార‌రు..! మాట విన‌రంటే విన‌రు..! వింటారు.. ఎవ‌రి మాటంటే.. భ‌జ‌న‌ప‌రుల మాట‌..! వాస్తవికత‌ను వ‌క్రీక‌రించి చెప్పేవారి మాట‌..! లేనిది ఉన్నట్టు అతిగా స్పందించేవారి మాట‌..! ఈ ఆవేద‌న‌పూరిత‌మైన మాట‌లు ఎవ‌రి నుంచి వ‌చ్చాయ‌ని అనుకుంటున్నారా..! తెలుగుత‌మ్ముళ్ల నుంచే..! ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృత‌స్థాయి స‌మావేశం అనంత‌రం.. ప‌లువురు తెలుగుత‌మ్ముళ నోటి వినిపించిన మాట‌లివి. పాపం..! టీడీపీ శ్రేణుల్లో ఎందుకింత నిర్వేదం అంటే.. దానికి బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్ ను విమర్శించడానికే….

టీడీపీ అధినేత‌, మాజీ ముఖమంత్రి చంద్రబాబు ఎంత‌సేపూ జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి స‌మ‌యం కేటాయిస్తున్నారుగానీ.. అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది..? ప‌క్కదోవ ప‌ట్టిస్తున్నవారెవ‌రు..? అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాల‌కు పాల్పడిందెవ‌రు..? పార్టీ కోసం క‌ష్టప‌డుతున్నదెవ‌రో తెలుసుకోవ‌డానికి మాత్రం ఆయ‌న స‌మ‌యం కేటాయించ‌డంలేద‌ని.. అందుకే ఆయ‌న‌కు నిజానిజాలు తెలియ‌డం లేద‌ని ప‌లువురు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

వారినే పక్కన పెట్టుకుని….

ఇక్కడ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడ‌డానికి మ‌రొక బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. పార్టీలో యువ‌త‌కు స‌ముచిత‌స్థానం క‌ల్పిస్తామ‌ని చంద్రబాబు అనేక‌సార్లు చెప్పారు. కానీ.. ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్న సంద‌ర్భాలు మాత్రం లేవ‌ని ప‌లువురు నాయ‌కులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఎంత‌సేపూ.. మ‌ళ్లీ ఆ వృద్ధ నేత‌ల‌ను, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న నేత‌ల‌ను ప‌క్కన‌పెట్టుకుంటున్నార‌ని, యువ‌త‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.

ఇప్పుడు కూడా వారినే….

పార్టీ రాష్ట్ర విస్తృత‌స్థాయి స‌మావేశంలోనూ దీనిపై చ‌ర్చ జ‌రుప‌కుండా.. కేవ‌లం అధికార వైసీపీని, ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డమే ప‌నిగా పెట్టుకున్నార‌ని అంటున్నారు. యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా.. వృద్ధ నేత‌ల‌కు, వారి వార‌సుల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, వారేమో..హాయిగా మెట్రోపాలిట‌న్ సిటీల్లో ఎంజాయ్ చేస్తుంటార‌ని, క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకునేవారిని మాత్రం చంద్రబాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ప‌లువురు నేత‌లు చంద్రబాబును త‌ప్పుదోవ‌ప‌ట్టించార‌ని, క్షేత్రస్థాయిలో అస‌లేం జ‌రుగుతుందో చెప్పకుండా.. అతిగా ఊహించి..మ‌ళ్లీ త‌మ‌దే అధికార‌మంటూ ఊద‌ర‌గొట్టార‌ని.. అందుకే ఈ ఎన్నిక‌ల్లో పార్టీకి ఇంత దారుణ ఓట‌మి ఎదురైంద‌ని ప‌లువురు కార్యక‌ర్తలు చెబుతున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు వారినే చంద్రబాబు ప‌క్కన‌పెట్టుకుని తిరుగుతున్నార‌ని, క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యక‌ర్తలు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నా ప‌ట్టించుకునే నాథుడే లేడ‌ని ఆవేద‌న చెందుతున్నారు.

ఓడిపోయినప్పుడే…..

అలాగే.. పార్టీ అనుబంధ సంఘాల బ‌లోపేతంపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టడం లేద‌ని విమ‌ర్శలు చేస్తున్నారు. కేవ‌లం పార్టీ ఓడిపోయిన‌ప్పుడు మాత్రం చంద్రబాబుకు యువ‌త గుర్తుకువ‌స్తుంద‌ని, ఆ త‌ర్వాత అధికారం చేప‌ట్టగానే మ‌రిచి పోతార‌ని.. ఇది చంద్రబాబు మొద‌టి నుంచి చేస్తున్న ప‌నేన‌ని.. ఇక ఆయ‌న మార‌రంటే మార‌ర‌ని.. టీడీపీ యువ కార్యక‌ర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News