అందుకే ఎన్నికలు కావాలంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. హైకోర్టు వ్యాఖ్యలను బట్టి చూసినా, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు [more]

Update: 2020-10-31 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. హైకోర్టు వ్యాఖ్యలను బట్టి చూసినా, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగడం ఖాయమని తెలిసిపోతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే టీడీపీకి లాభమేనా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. అందుకే స్థానికసంస్థల ఎన్నికలను జరపాలని టీడీపీ పదే పదే కోరుతుంది.

పదిహేను నెలల్లో……

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడస్తుంది. ఈ పదిహేను నెలల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వం పై ప్రజలలో అసంతృప్తి బాగా పెరిగిందన్న అంచనాలో టీడీపీ ఉంది. మరోవైపు కరోనా మహమ్మారితో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తూ వస్తుంది. జగన్ చేతకాని తనంవల్లనే కరోనా దేశంలో అగ్రస్థానానికి చేరుకుందని కూడా ఆరోపిస్తుంది.

అభివృద్ధి లేకపోవడంతో…..

మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా అభివృద్ధిపై ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దీంతో గ్రామాల నుంచి పట్టణాల వరకూ అనేక సమస్యలతో అల్లాడిపోతున్నాయి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఏవీ రాకపోవడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో యువత కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని టీడీపీీ భావిస్తుంది.

అనుకూల ఫలితాలు వస్తాయని….

మరోవైపు జగన్ మూడు రాజధానుల అంశం కూడా తమకు అనుకూలంగా మారనుందని, దాని ఫలితం స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్పిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు సయితం అభిప్రాయపడుతున్నారు. కోస్తాంధ్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని నమ్మకంగా ఉన్నారు. అందుకే తిరిగి మొత్తం ఎన్నికలను షెడ్యూల్ చేయాలని టీడీపీ కోరుతుంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం పెంచుకుని పార్టీని తిరిగి గాడిన పెట్టాలన్న చంద్రబాబు యోచన ఫలిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News