టీడీపీలో ఆ ముగ్గురివీ దారులు వేరేనా?

తెలుగుదేశానికి మూడు నంబర్ అంటే తెగ చిరాకుగానే ఉంది మరి. 23 నంబర్ దగ్గర గత‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఆగాయి. కానీ ఆ పార్టీకి [more]

Update: 2021-05-10 13:30 GMT

తెలుగుదేశానికి మూడు నంబర్ అంటే తెగ చిరాకుగానే ఉంది మరి. 23 నంబర్ దగ్గర గత‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఆగాయి. కానీ ఆ పార్టీకి ఎంపీలు కూడా ముగ్గురే ఉన్నారు మరి. దాంతో మూడు అంటేనే మూడు రావవడంలేదుట. సరే ఈ ముగ్గురు అయినా కలసివస్తున్నారా అంటే కలవరమే సమాధానంగా ఉంది మరి. ఇక తెలుగుదేశం పార్టీలో ఎంపీలు తలో దారిగా ఉంటున్నారు. నిజానికి ముగ్గురు ఎంపీలు అంటే 21 మంది ఎమ్మెల్యేలతో సమానం. పార్టీ కష్టకాలంలో వారు అండగా ఉంటే అధినాయకత్వానికి కొండంత బలం కూడా.

ఫుల్ సైలెంట్ …..

ఇక విజయవాడకు చెందిన ఎంపీ కేశినేని నాని ఇపుడు ఫుల్ సైలెంట్ గా ఉన్నారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల తరువాత టీడీపీ నేతలే సరిగ్గా పనిచేయక తన కుమార్తె శ్వేతకు వెన్నుపోటు పొడిచారని నాని భావిస్తున్నారని టాక్. పైగా బుద్ధా వెంకన్న, బోండా ఉమ లాంటి వారు దారుణంగా కేశినేని నాని మీద విమర్శలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో టీడీపీలో కేశినేని నాని ఒంటరి అయ్యారు కార్పోరేషన్ ఎన్నికలు జరిగి నెల దాటుతున్నా కూడా నాని చడీ చప్పుడూ లేకుండా ఉంటున్నారు. ఆయన వేరే ఆలోచనల్లో ఉన్నారని ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. బీజేపీ దారి పడతారు అన్న మాట కూడా ఉంది.

ఈయన అంతేగా….

ఇక గుంటూరు నుంచి గెలిచిన గల్లా జయదేవ్ సైతం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు అంటున్నారు. తన సొంత జిల్లా తిరుపతిలో లోక్ సభకు ఉప ఎన్నిక జరిగితే జయదేవ్ అంటీముట్టనట్లు వ్యవహరించారన్న విమర్శ కూడా ఉంది. జయదేవ్ వంటి వారికి టీడీపీ మీద ఒక రకమైన అసంతృప్తి ఉందని అంటున్నారు. ఏపీలో పార్టీ వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదని కూడా భావిస్తున్నారు అని తెలుస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఎవరి మాట వినే రకం కాదు. దాంతోనే సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. ఆయన కూడా బీజేపీలోని కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉన్నారని చెబుతున్నారు.

గోడ మీదనేనా ….?

ఇక శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద కూడా ఒక దశలో బీజేపీలో చేరుతారు అని ప్రచారం జరిగింది. కానీ ఆయన సొంత బాబాయ్ అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఇవ్వడంతోనే ఆయన కాళ్ళకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. కానీ టీడీపీలో ఆయన అంత సుఖంగా లేరు అన్న మాట అయితే ఉంది. ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరిక ఉన్నా బాబు కోరి మరీ ఎంపీగా పంపారు. ఇలాగైతే తాను ఎప్పటికీ ఢిల్లీకే పరిమితం కావాలా అన్న ఆవేదన ఆయనలో ఉందిట. ఇక మరో వైపు ఏపీలో రాజకీయ పరిణామాలను కూడా రామ్మోహన్ నిశితంగానే గమనిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలూ గోడ మీదనే ఉన్నారని వైసీపీకి చెందిన రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ బాంబు పేల్చారు. నిజానికి ఇవేవీ టెడీపీ అధినాయకత్వ‌నికి తెలియని విషయాలు కావు. కానీ ప్రత్యర్ధి పార్టీ చెప్పడంతోనే పసుపు శిబిరం అలెర్ట్ అవుతోందిట. ఎవరు ఏం చేసినా నిఘా పెట్టి చూసినా ఎవరు ఎపుడు ఏం చేయాలో అదే చేస్తారు అన్న మాట అయితే వినిపిస్తోంది. చూడాలి మరి.

Tags:    

Similar News