Ycp : బాగా థ్రెట్…చివరి నిమిషంలో జంప్ తప్పదా?

వైసీపీ ఏపీలో బలంగా ఉండవచ్చు. వచ్చే ఎన్నికలలో గెలవనూ వచ్చు. అధికార పార్టీలో ఆ ధీమా కన్పిస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తమ నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి [more]

Update: 2021-11-09 12:30 GMT

వైసీపీ ఏపీలో బలంగా ఉండవచ్చు. వచ్చే ఎన్నికలలో గెలవనూ వచ్చు. అధికార పార్టీలో ఆ ధీమా కన్పిస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తమ నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. పార్టీని వీడే ఛాన్సులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇందులో ఇద్దరు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. చివరి నిమిషంలో వీరు టీడీపీ గూటికి చేరుకుంటారని చెబుతున్నారు.

నలుగురు ఎమ్మెల్యేల్లో…

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుదారులుగా నిలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో మద్దాల గిరికి మరో ఆప్షన్ లేదు. ఆయన వైసీపీలో కొనసాగాల్సిందే. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు మాత్రం వైసీపీ జెండా పట్టుకోక తప్పదు. మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ వైపు చూసే అవకాశమే లేదు. ఆయన మరోసారి వైసీపీ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇక కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ లకు మాత్రం వైసీపీని వీడే పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

కరణం గ్యారంటీ అట….

కరణం బలరాం సుదీర్ఘకాలం తర్వాత చీరాల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన వైసీపీికి మద్దతుదారుగా మారారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కరణం ఇప్పటికీ టీడీపీపై విమర్శలు చేయడం లేదు. ఆయనకు నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ నుంచి రాజకీయంగా థ్రెట్ ఉంది. వచ్చే ఎన్నికలలో తనకు టిక్కెట్ ఇచ్చినా ఆమంచి వర్గం మద్దతు ఇవ్వదని కరణం డిసైడ్ అయిపోయారు. దీంతో ఆయన ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

వాసుపల్లి ఇబ్బందులలో….

మరో రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. ఆయనకు వైసీపీ నుంచి మద్దతు లభించడం లేదు. నియోజకవర్గంలో ఆయనను పార్టీలో దాదాపు ఒంటరిని చేశారు. అధినాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లోనే దారుణంగా వాసుపల్లి దెబ్బతిన్నారు. వైసీీపీలోనే ఉంటే మరోసారి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదని ఫిక్స్ అయ్యారు. ఆయన కూడా టీడీపీ లో చివరి నిమిషంలో చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే వీరిని చంద్రబాబు తిరిగి పార్టీలో చేర్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News