మ…మ అనిపించేస్తారా?

రాష్ట్ర ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పండుగ మ‌హానాడు. ఏటా మే 28న అత్యంత ఘ‌నంగా నిర్వహిం చే ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి [more]

Update: 2020-02-21 00:30 GMT

రాష్ట్ర ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పండుగ మ‌హానాడు. ఏటా మే 28న అత్యంత ఘ‌నంగా నిర్వహిం చే ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి ద‌శ, దిశ‌ను నిర్ణయిస్తారు. టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు, దివంగ‌త ఎన్టీఆర్ జ‌యంతిని పుర‌స్కరించుకుని ఆయ‌న జీవించి ఉన్న కాలంలోనే ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఉన్నన్నాళ్లూ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయ‌డం ద్వారా పార్టీని మ‌రింత‌గా ముందుకు తీసుకువెళ్లేం దుకు ప్రయ‌త్నించారు. అస‌లు మ‌హానాడు అంటేనే అదో పెద్ద సంరంభం. పార్టీలో కింది స్థాయి కార్యక‌ర్త నుంచి పైస్థాయి నేత వ‌ర‌కు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం కోసం వేచి చూస్తారు.

మూడు రోజుల పాటు….

మొత్తం మూడు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ ఉత్థాన ప‌త‌నాల‌ను ప్రస్తావించుకుంటూనే.. పార్టీకి ద‌శ దిశ‌ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు బాధ్యతలు చేప‌ట్టిన త‌ర్వాత కూడా ఈకార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో గ‌త ఏడాది మిన‌హా ఆయ‌న ఈ కార్యక్రమాన్ని భారీగానే నిర్వహించారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌లు ఉండ‌డం, ఎన్నిక‌లు ముగిసి, ఫ‌లితాల కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తూ ఉన్న నేప‌థ్యం, మ‌రోపక్క ముంద‌స్తు ఎన్నిక‌ల ఫ‌లితాలు బాబుకు వ్యతిరేకంగా ఉండ‌డంతో అప్పట్లో ఈ మ‌హానాడును వాయిదా వేశారు. ఇక‌, ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలే నిజ‌మ‌య్యాయి. ఈ క్రమంలో ఇక‌, మ‌హానాడును నిర్వహించ‌లేదు.

ఇప్పటి వరకూ…

ఇక‌, మ‌రో రెండు మాసాల్లో ఈ ఏడాది మ‌హానాడుకు రంగం సిద్ధం చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. క‌నీసం రెండు నెల‌ల ముందుగానే క‌మిటీని ఏర్పాటు చేసుకుని, ఎక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఎలాంటి తీర్మానాలు ప్రవేశ పెట్టాలి ? ఎవ‌రెవ‌రికి బాధ్యత‌లు అప్పగించాలి? అనే విష‌యాల‌పై సాధార‌ణంగా ఫిబ్రవ‌రి మూడు, నాలుగు వారాల్లోనే పార్టీలో చ‌ర్చలు జ‌రుగుతుంటాయి. ఈ క్రమంలోనే మ‌రి ఈ ఏడాది మ‌హానాడుపై ఇప్పటి వ‌ర‌కు పార్టీలో ఎలాంటి చ‌ర్చలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరో వారంలో…..

నాయ‌కులు కూడా భారీ ఎత్తున పార్టీకి దూరంగా ఉండ‌డంతోపాటు గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 స్థానాల్లో గెలుపు గుర్రంఎక్కడం, వాటిలోనూ ఇద్దరు జంప్ చేయ‌డం వంటి ప‌రిణామాలు స‌హా రాష్ట్రంలో ఏర్పడిన మూడు రాజ‌ధానుల వివాదంతో పార్టీ నేత‌లు ఎవ‌రికి వారుగా వ్యవ‌హ‌రి స్తున్నారు. అమ‌రావ‌తిని స‌మ‌ర్ధిస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్రవైపు వెళ్లేందుకు కూడా జంకుతున్నారు. ఇక పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి ఉన్న సీనియ‌ర్లు ఇక విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే టైంలో పార్టీలో మ‌రింత యువ‌ర‌క్తం నింపాల్సిన అవ‌స‌రం ఉంది. యువ‌త పార్టీకి దూర‌మ‌వుతున్న డేంజ‌ర్ బెల్స్ ఇప్పటికే వ‌చ్చేశాయి. మ‌రోవైపు నంద‌మూరి ఫ్యామిలీ స‌మ‌స్యను ఎలా తీరుస్తారో ? తెలియ‌డం లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా మ‌హానాడు ఉంటుందా? ఉండ‌దా? అనే సందేహాలు ముసురుకున్నాయి. మ‌రో వారంలో దీనికి సంబంధించి క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

Tags:    

Similar News