అక్కడ టీడీపీ పుంజుకుందా… ఈ కొత్త ఆశ‌లేంటో ?

ఏపీలో వైజాగ్ సిటీ గ‌త ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చింది. జ‌గ‌న్ అప్రతిహ‌త విజ‌యం వైజాగ్‌లో మాత్రం సాధ్యం కాలేదు. సిటీలు నాలుగు దిక్కులా న‌లుగురు [more]

Update: 2021-02-15 08:00 GMT

ఏపీలో వైజాగ్ సిటీ గ‌త ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చింది. జ‌గ‌న్ అప్రతిహ‌త విజ‌యం వైజాగ్‌లో మాత్రం సాధ్యం కాలేదు. సిటీలు నాలుగు దిక్కులా న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. త‌ర్వాత మాత్రం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ పార్టీ జంప్ చేసేశారు. రూర‌ల్లో మాత్రం వైసీపీ తిరుగులేకుండా స‌త్తా చాటింది. తాజా స్థానిక ఎన్నిక‌ల్లోనూ వైసీపీ స్వీప్ చేస్తే ప‌సుపు పార్టీ ప‌నైపోయిన‌ట్టే అవుతుంది. పార్టీకి పుట్టగ‌తులు ఉండ‌వు స‌రిక‌దా ? ఇప్పట్లో పుంజుకోవ‌డం క‌ష్టమే అవుతుంది. ఈ విష‌యం టీడీపీకి వాళ్లకు బాగా తెలుసు అందుకే… స్థానికంలో శ‌క్తికి మంచి మ‌రీ క‌ష్టప‌డుతున్నారు. విశాఖ రూర‌ల్ జిల్లాలో వైసీపీ జోరుకు అడ్డుక‌ట్ట వేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు పార్టీతో అంటీముట్టన‌ట్టుగా ఉన్న సీనియ‌ర్ నేత‌లు సైతం రంగంలోకి దిగి త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌గ్గరుండి మ‌రీ ఎన్నిక‌ల మంత్రాగం అమ‌లు చేస్తున్నారు.

అనకాపల్లి డివిజన్ పై ఆశలు….

సాధార‌ణ ఎన్నిక‌లు పూర్తయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటి వ‌ర‌కు ఇళ్లలో నుంచి బ‌య‌ట‌కు రాని నేత‌లు అంద‌రూ ఇప్పుడు పోరాడితే పోయేదేముంది అన్న రేంజ్‌లో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమ‌వుతున్నారు. ముఖ్యంగా అన‌కాప‌ల్లి డివిజ‌న్‌పై టీడీపీ గ‌ట్టి ఆశ‌లే పెట్టుకుంది. ఈ డివిజ‌న్లో మాత్రం అధికార పార్టీని ఢీకొట్టి స‌మంగా స్థానాలు సంపాదించుకుంటామ‌న్న ధీమా ఆ పార్టీలో క‌నిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్యన్నపాత్రుడు నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సీప‌ట్నంలో ఈ సారి వైసీపీ సీన్ రివ‌ర్స్ అయ్యిందనే అంటున్నారు. ఈ సారి స్థానికంలో అక్కడ సైకిల్ ప‌రుగులు పెడుతుంద‌ని.. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్‌పై ఉన్న వ్యతిరేక‌త‌ను ఈ సారి అయ్యన్న క్యాష్ చేసుకుంటాడ‌నే అంటున్నారు.

ఎమ్మెల్యే పనితీరు…..

ఇక చోడ‌వ‌రంలో ఎమ్మెల్యే కరణం ధ‌ర్మశ్రీపై సొంత పార్టీలోనే ఓ వ‌ర్గం గుస్సాతో ఉంది. పైగా ఇటీవ‌ల ఆయ‌న చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానంతో గ్యాప్‌ను పెంచాయి. దీంతో ఇక్కడ మ‌రికొంద‌రు సైతం ధ‌ర్మశ్రీ టార్గెట్ గా దూకుడుగా ఉంటున్నారు. ఇది టీడీపీకి క‌లిసొస్తోంది. ఇక య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలోనూ గ‌తంతో పోలిస్తే టీడీపీ పుంజుకున్న ప‌రిస్థితే ఉంది. ఇక స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి తీరు కూడా విప‌క్షాల‌కు ప్లస్‌.. అధికార ప‌క్షాల‌కు మైన‌స్ అవుతోంది. పాయ‌క‌రావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అనిత‌పై సొంత పార్టీలోనే చాలా వ్యతిరేక‌త ఉన్నా కేడ‌ర్ క‌సితో ఉండ‌డంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్వేదం ఆ పార్టీకి మైన‌స్‌గా మారింది.

ఏజెన్సీలో మినహాయించి….

మాడుగులలోనూ ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ పుంజుకున్న ప‌రిస్థితి ఉంది. ఏజెన్సీలో మాత్రమే టీడీపీ పూర్తిగా చేతులు ఎత్తేస్తోన్న ప‌రిస్థితి. పెందుర్తి, గాజువాక‌, భీమిలి ప్రాంతాల్లోని రూర‌ల్ ఏరియాల్లో మాత్రం వైజాగ్ కేపిట‌ల్ ఎఫెక్ట్ ప‌డేలా ఉంది. ఏదేమైనా గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పోలిస్తే వైజాగ్ సిటీ స‌రౌండింగ్స్ వ‌దిలేసి మిగిలిన గ్రామీణంలో టీడీపీ పుంజుకున్న పరిస్థితి అయితే ఉంది. మ‌రి ఇది ఎన్నిక‌ల్లో ఎంత వ‌ర‌కు ప్రభావం చూపుతుందో ? చూడాలి.

Tags:    

Similar News