బెజవాడలో ఫిట్టింగ్ మాస్టర్స్…మరి ఆ పదవి ఎవరికో?

ప్రస్తుత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కార్పొరేష‌న్‌ల‌కు కూడా ఈ నెల ఆఖ‌రులోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మ‌ధ్య ఎన్నిక‌ల్లో పోటీ [more]

Update: 2020-03-15 00:30 GMT

ప్రస్తుత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కార్పొరేష‌న్‌ల‌కు కూడా ఈ నెల ఆఖ‌రులోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మ‌ధ్య ఎన్నిక‌ల్లో పోటీ తీవ్రంగా ఉంది. అదే స‌మ‌యంలో మేయ‌ర్ పీఠాల‌ను ద‌క్కించుకునే విష‌యంలోనూ ఇరు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. అయితే, రెండు పార్టీల మ‌ధ్య ఉండాల్సిన పోటీ స‌హ‌జ‌మే. అయితే, దీనికి భిన్నంగా మేయ‌ర్ పీఠం కోసం టీడీపీలో అప్పుడే కుమ్ములాట‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇంకా ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌కుండానే అధిష్టానంపై ఒత్తిడులు ప్రారంభ‌మ‌య్యాయి. అంతేకాదు, అధిష్టానం మాకే మొగ్గు చూపుతుంద‌నే ప్రచారం కూడా జ‌రుగుతోంది.

గద్దె కుటుంబం నుంచి….

ఇలా మొత్తం న‌లుగురు నాయ‌కులు మేయ‌ర్ పీఠం కోసం విజ‌య‌వాడ టీడీపీలో కుమ్ములాట‌ల‌కు సిద్ధమయ్యారు. విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో కృష్ణా జెడ్పీ చైర్‌ప‌ర్సన్‌గా చేసిన గ‌ద్దె అనురాధ విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేందుకు రెడీ అయ్యారు. ఆమె భ‌ర్త గ‌ద్దె రామ్మోహ‌న్‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌తంలోనే ఆమె త‌న ఓటును కూడా ఇక్కడ‌కు మార్పించుకున్నారు. పాల‌నానుభ‌వం ఉండ‌డం, జిల్లాపై ప‌ట్టుండ‌డంతో ఆమె మేయ‌ర్ పీఠం త‌న‌కే ద‌క్కుతుంద‌ని ఆశ పెట్టుకున్నారు. అనూరాధ మేయ‌ర్ పీఠంపై క‌న్నేసే త‌న‌కు గ‌న్నవ‌రం బాధ్యత‌లు ఇస్తాన‌న్నా తీసుకోలేద‌ని అంటున్నారు.

కేశినేని నాని సయితం…

ఇదిలావుంటే , విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. త‌న రెండో కుమార్తె శ్వేత‌ను బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ఇప్పటికే చంద్రబాబు కూడా త‌మ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ప్రచారం చేసుకుంటున్నారు. గ‌త రెండు పార్లమెంటు ఎన్నిక‌ల్లో శ్వేత త‌న తండ్రి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్రచారం చేసిన శ్వేత‌కు రాజ‌కీయాలు కొత్తే అయినా.. మేయ‌ర్ పీఠంపై మాత్రం చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రోప‌క్క, సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన బొండా ఉమా.. కూడా త‌న స‌తీమ‌ణి సుజాత‌ను మేయ‌ర్ పీఠంపై కూర్చోబెట్టాల‌ని నిర్ణ యించుకున్నారు.

సామాజిక అస్త్రంతో….

అవ‌స‌ర‌మైతే అధిష్టానాన్ని మేయ‌ర్ ప‌ద‌వి కోసం బెదిరించాల‌ని కూడా ఆయ‌న నిర్ణయించుకున్నార‌న్న టాక్ టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈయ‌న కూడా అధిష్టానం త‌న‌వైపే ఉంటుంద‌ని ప్రచారం మొద‌లు పెట్టారు. గ‌త ట‌ర్మ్‌లో క‌మ్మ వ‌ర్గానికి చెందిన కోనేరు శ్రీథ‌ర్‌కు మేయ‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఈసారి ఈ ప‌ద‌వి కాపుల‌కు ఇవ్వాల‌ని బొండా స‌రి కొత్త అస్త్రం వాడ‌నున్నార‌ట‌. బొండా భార్య సుజాత క‌మ్మ వ‌ర్గం కావ‌డంతో ఇక్కడ రెండు ఈక్వేష‌న్లు సెట్ కానున్నాయి. ఈ ముగ్గురి ప‌రిస్థితి ఇలా ఉంటే.. దేవినేని వ‌ర్గానికి చెందిన అప‌ర్ణ కూడా బ‌రిలో ఉన్నారు. ఆమె ఇప్పటి వ‌ర‌కు కార్పొరేట‌ర్‌గా ప‌నిచేశారు. త‌న‌కు ఖ‌చ్చితంగా మేయ‌ర్ పీఠం ద‌క్కుతుంద‌ని ఆమె ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ మొత్తం ప‌రిణామంతో విజ‌య‌వాడ టీడీపీలో మేయ‌ర్ పీఠం కోసం నాలుగు స్తంభాలాట సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News